అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్సిటీ వలలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్సిటీ వలలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. దేశం కానీ దేశంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడంతో వారికి సాయం చేయడానికి తానా రంగంలోకి దిగింది.
అక్రమ వలస దారుల్ని గుర్తించడానికి 2016లో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే పేరుతో హోంల్యాండ్ అధికారులు వర్సిటీని ఏర్పాటుచేశారు. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వారి వీసా కాలపరిమితి అయిపోయినప్పటికీ ఇంకా అమెరికాలో నివసిస్తున్నారో తెలుసుకున్నారు.
undefined
ఈ క్రమంలో సుమారు 600 మంది విద్యార్ధులను ఇమ్మిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులున్నారు. మాస్టర్స్ పూర్తి చేసి హెచ్1బీ వీసాకు అప్లై చేసిన వారు చాలా మంది ఉన్నారు. దీంతో భారత్‌లో ఉన్న విద్యార్థుల తల్లీదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రంగంలోకి దిగింది. భారత్‌లో ఉన్న తానా అధ్యక్షుడు సతీశ్ వేమన ఆదేశాల మేరకు ప్రతినిధులు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
విషయాన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలకు అందిస్తున్నారు. న్యాయపోరాటం చేయడానికి లాయర్లను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చాలా మంది విద్యార్దులు సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే