తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ ఖడాంతరాలను దాటింది. ఉపాధి రిత్యా ఇతర దేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంతూళ్లకు రాలేకపోయిన ప్రవాసులు కూడా తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇలాగ తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో కార్డిఫ్ నగరంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంస్థ మొదటి వార్డికోత్సవంతో పాటు సంక్రాతి పండగ కలిసి రావడంతో రెండింటిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్స్, ఇంగ్లాండ్ లలో నివాసముంటున్న తెలుగువారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రమఖులు వెలగపూడి బాపూజీ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపూజీ రావు మాట్లాడుతూ... తెలుగు ప్రజల ఐకమత్యం, స్ఫూర్తి ఇలాగే ఎప్పుడు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ ఆద్వర్యంలో గతంలో నిర్వహించిన బాల దినోత్సవం, మహిళా దినోత్సవం, సంక్రాంతి , బోనాల జాతర వంటి కార్యక్రమాలను ఆయన అభినందించారు. తెలుగు బాషా, సంస్కృతిని కాపాడటానికి ఈ సంస్థ సభ్యులు చేపట్టిన తెలుగు బడి కార్యక్రమం చాలా విశేషమైందన్నారు. ఈ సందర్భంిగా ఆయన తెలుగు అసోసియేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు.
undefined
ఆయన ప్రసంగం తర్వాత సంక్రాతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగింటి మహిళలు ముగ్గుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పురుషులు, మహిళలతో పాటు చిన్నారులు ఉత్పాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి తెలుగు అసోసియేషన్ వారు తెలుగు వంటకాలతో ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ పిజ్జాలు, బర్గర్లు తినే వారు ఈ విందుతో అమ్మ చేతి వంటను, సొంత ఊళ్లను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు , పచ్చళ్ళు మరియు స్వీట్స్‌లతో కూడిన విందును ప్రతీ ఒక్కరు సంతోషంగా ఆరగించారు.
చివరగా తెలుగు అసోసియేషన్ అఫ్ వేల్స్ సభ్యులు మాట్లాడుతూ... ఈ సంస్థ ఇదే స్ఫూర్తితో, అందరి సహాయ సహాకారాలతో ఇకపై కూడా ఇలాగే మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. తెలుగు వారే అత్యంత వైభవంగా జరుపుకునే తెలుగింటి పండగా సంక్రాంతిని అందరం కలిసి జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.