మ్యారేజ్ డేకి ముందు విషాదం: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

By pratap reddyFirst Published 22, Aug 2018, 10:33 AM IST
Highlights

తెలుగు టెక్కీ మృదుల్ చెరుకుపల్లి ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో మరణించాడు. మ్యారేజీ డేకి ఒక రోజు ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సుష్మ (27), కూతురు రాజశ్రీ (6) ఉన్నారు.

డల్లాస్: తెలుగు టెక్కీ మృదుల్ చెరుకుపల్లి ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో మరణించాడు. మ్యారేజీ డేకి ఒక రోజు ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సుష్మ (27), కూతురు రాజశ్రీ (6) ఉన్నారు. 

ఈ నెల 20వ తేదీన ఆయన తన ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. మృదుల్ డల్లాస్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గుండెపోటుతో ఆయన మృత్యువాత పడ్డాడు. 

మృదుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందినవాడు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఎన్నారై సంఘాలు, తెలుగు కమ్యూనిటీ కృషి చేస్తున్నాయి. 

Last Updated 9, Sep 2018, 12:33 PM IST