భార్య కళ్లెదుటే..మరో యువతిపై లైంగిక దాడి

By ramya neerukondaFirst Published 18, Aug 2018, 9:35 AM IST
Highlights

ఆ యువతి లేచి చూసేసరికి తన డ్రస్ బటన్స్ విప్పి ఉన్నాయి. అంతేకాకుండా.. తన ప్రైవేట్ పార్ట్స్ పై రమనమూర్తి చేతలతో తడుమతూ ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువతి ఉలిక్కి పడింది. అనంతరం వెంటనే సిబ్బందికి అతనిపై ఫిర్యాదు చేసింది. 

కట్టుకున్న భార్య కళ్లెదుటే.. ఓ వ్యక్తి మరో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది కూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు. ఈ దారుణ సంఘటన డెట్రాయిట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన రమణమూర్తి అమెరికాలోని రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేసేవాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు. తనకు ఓవైపు భార్య... మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు ఉపక్రమించాడు. 

ఏదో ఇబ్బందిగా ఉందని ఆ యువతి లేచి చూసేసరికి తన డ్రస్ బటన్స్ విప్పి ఉన్నాయి. అంతేకాకుండా.. తన ప్రైవేట్ పార్ట్స్ పై రమనమూర్తి చేతలతో తడుమతూ ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువతి ఉలిక్కి పడింది. అనంతరం వెంటనే సిబ్బందికి అతనిపై ఫిర్యాదు చేసింది. 

 ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ రమణమూర్తి మొదట దబాయించాడు. లోతుగా ప్రశ్నించేసరికి... చేయకూడనిది చేసి ఉంటానని నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ న్యాయస్థానం  ఇటీవల అతడిని దోషిగా తేల్చింది.

Last Updated 9, Sep 2018, 11:50 AM IST