అమెరికాలో ఎపి టెక్కీ అనుమానాస్పద మృతి

By pratap reddyFirst Published 19, Aug 2018, 8:07 PM IST
Highlights

అమెరికా మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బోళ్ల వీర వెంకట సత్య సురేష్ (35) అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు

ఏలూరు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు అమెరికాలో మరణించాడు. అమెరికా మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బోళ్ల వీర వెంకట సత్య సురేష్ (35) అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు. 

అతని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామం అని తెలుస్తోంది. సురేష్ రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. సురేష్ కారులో చనిపోయి ఉండడాన్ని గమనించి స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 
 
ఇటీవల డి మౌంట్‌లో తెలుగు యువకుడు దీపక్‌ అనుమానాస్పద స్థితిలో మరమించాడు. ప్రకాశం జిల్లా పామూరు వాసి దీపక్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ దీపక్‌ మృతి చెందినట్టు అమెరికా పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. 

Last Updated 9, Sep 2018, 11:51 AM IST