సెల్పీ సరదా... అమెరికాలో తెలుగు యువతి బలి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 14, 2020, 11:19 AM ISTUpdated : Sep 14, 2020, 12:12 PM IST
సెల్పీ సరదా... అమెరికాలో తెలుగు యువతి బలి (వీడియో)

సారాంశం

ఉన్నత చదువుల కోసం అమెరికా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకెళుతున్న ఓ యువతి విగతజీవిగా స్వదేశానికి తిరిగివస్తున్న విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  

కొలంబియా: ఉన్నత చదువుల కోసం అమెరికా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకెళుతున్న ఓ యువతి విగతజీవిగా స్వదేశానికి తిరిగివస్తున్న విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అమెరికాలో నివాసముంటున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన యువతి ఓ జలపాతంవద్ద ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందింది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతుల రెండో కూతురు కమల(27) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తిచేసిన ఆమె కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇలా కెరీర్ హాయిగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆమె ప్రమాదానికి గురయ్యారు. 

read more   అంతర్వేదిలో రథం దగ్థం: డ్యూటీలోని 10 మంది పోలీస్ అధికారులకు పాజిటివ్

కొలంబియాలోని  ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్న కమల శనివారం వీకెండ్ కావడంతో బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంటికి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని ఓ జలపాతం వద్ద సరదాగా ఆగారు. ఈ క్రమంలో జలపాతం వద్ద సరదాగా సెల్పీ కోసం ప్రయత్నించి కాలుజారి నీటిలో పడిపోయారు. అక్కడున్నవారు ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు. నీటిలో మునిగి కమల మృతిచెందారు. 

ఈ విషయం తెలిసి గుడ్లవల్లేరులోని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాట్స్‌ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..