అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ వాసి దుర్మరణం..!

By telugu news teamFirst Published Nov 25, 2021, 10:09 AM IST
Highlights

భారత్ కి పంపేందుకు ఎక్కువ మొత్తంలొ డబ్బులు అవసరం అవ్వడంతో.. ‘గో ఫౌండ్ మీ’ అనే పేజీలో సహాయం కోసం దాతలను అర్జించాడు. కాగా.. ఇప్పటి వరకు 36వేల డాలర్లు పోగు అయినట్లు అతని స్నేహితుడు తెలిపారు. దాదాపు 301 మంది.. డబ్బులు సహాయం చేయడం గమనార్హం.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  నల్గొండ జిల్లా వాసి మృతి చెందాడు. ఈ నెల 19న రాత్రి జరిగిన ఘటనలో తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్ దుర్మరణం పాలయ్యాడు. రెండేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం శేఖర్ అమెరికా వెళ్లాడు. అక్కడ కారు ఢీ కొనడంతో.. ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Also Read: హైదరాబాద్ శివారులో దారుణం... వృద్దురాలిపై ఇద్దరు దుండగుల అత్యాచారం, హత్య

అమెరికాలో ఈవెంట్ మేనేజర్ గా ఓ హోటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. రోడ్డు ప్రమాదంలో శేఖర్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. అతని స్నేహితుడు.. మృతదేహాన్ని భారత్ కి పంపేందుకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. భారత్ కి పంపేందుకు ఎక్కువ మొత్తంలొ డబ్బులు అవసరం అవ్వడంతో.. ‘గో ఫౌండ్ మీ’ అనే పేజీలో సహాయం కోసం దాతలను అర్జించాడు. కాగా.. ఇప్పటి వరకు 36వేల డాలర్లు పోగు అయినట్లు అతని స్నేహితుడు తెలిపారు. దాదాపు 301 మంది.. డబ్బులు సహాయం చేయడం గమనార్హం.

Also Read: మైనర్ కూతురి మీద కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో...

ఈ నెల 19వ తేదీన.. తన విధులు పూర్తి చేసుకొని.. తన రూమ్ కి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి ఓ వాహనం వచ్చి ఢీ కొట్టిందని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం మేరీలాండ్ లోని ఎల్లికాట్ సిటీలో  జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే.. శేఖర్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
 

Also Read: Telangana Local body Mlc elections: మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

click me!