బాల మేధావి...15 ఏళ్లకే ఇంజనీరింగ్ పూర్తిచేసి, పీహెచ్‌డి ప్రిపరేషన్

First Published Jul 30, 2018, 3:11 PM IST
Highlights

అమెరికాలో నివాసముంటున్న భారతీయ సంతతి బాలుడొకరు తన మేధస్సులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. స్కూల్లో గడపాల్సిన వయసులో ఉన్నత చదువుల వైపు అలవోకగా పయనిస్తున్నాడు. చిన్న వయసులోనే తన అపార మేదస్సుతో ఇప్పటికే డిగ్రీ పట్టా తీసుకున్న బుడతడు పీహె‌చ్‌డి కోసం సన్నదమవుతున్నాడు.

కేరళకు చెందిన తాజీ, బిజౌ అబ్రహం దంపతులు ఉద్యోగ రిత్యా అమెరికాలో నివాసముంటున్నారు. వీరికి తనిష్క్ అబ్రహం అనే ఓ బాలమేదావైన కొడుకు ఉన్నాడు. ఇతడు చిన్నప్పటి నుండి వయసుకు మించిన మేదస్సుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేవాడు. అయితే పెద్దవుతున్న కొద్ది బాలుడి జ్ఞాపక శక్తి, మేధస్సు మరింత రాటుదేలింది. దీంతో పదోతరగతి చదవాల్సిన 15 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. అదీ అత్యున్నతమైన కాలిపోర్నియా యూనివర్సిటీ నుండి కావడం మరో విశేషం. తనిష్క్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లో అత్యంత  ప్రతిభను కనబర్చినట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు.

అయితే ఇంతటితో తనిష్క్ ప్రయాణం ఆగలేదు. డిగ్రీ పూర్తయిన వెంటనే తనకెంతో ఇష్టమైన పరిశోధనల వైపు దృష్టి మళ్లించాడు. ఇందుకోసం అతడు పీహెచ్‌డీ చేయడానికి సన్నదమవుతున్నాడు. ఇప్పటికే పరిశోధన విద్యార్థిగా పేరు నమోదు చేసుకున్న తనిష్క్... రోగులను ముట్టకోకుండానే వారి హృదయ స్పందన రేటును లెక్కించే పరికరాన్ని కనిపెట్టాడు. అలాగే క్యాన్సర్ ను నయం చేయడానికి కొత్త చికిత్స పద్దతుల కోసం పరిశోధనలు చేస్తున్నాడు. అత్యంత తొందరగా పీహెచ్‌డీ సాధించి డాక్టర్ గా మారాలని తనిష్క్ ఉవ్విళ్లూరుతున్నాడు.  
 
click me!