సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా విషాదం..

By Sumanth Kanukula  |  First Published Mar 22, 2023, 12:12 PM IST

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో కన్నుమూశాడు. ఆ వ్యక్తి మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. 


తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో కన్నుమూశాడు. ఆ వ్యక్తి మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో అతడు సౌదీ విమానాశ్రయంలోనే కుప్పకూలిపోయాడు. అయితే మార్చి 2వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తెలంగాణలోని జగిత్యాలలోని కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహ్మద్ చాంద్ పాషా సౌదీ అరేబియాలోని అభా నగరంలో పని చేసేందుకు వెళ్లాడు. 

అయితే మార్చి 2వ తేదీన తిరిగి భారత్‌కు బయలుదేరేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. మరో గంటలో అతడి ప్రయాణించాల్సిన విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే ఈలోపే మహ్మద్ చాంద్ పాషాకు గుండెపోటు వచ్చింది. అయితే ఇది గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి తరలించేలోపే చాంద్ పాషా మృతిచెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. 

Latest Videos

అయితే మార్చి 2న మహ్మద్ చాంద్ పాషా మరణించగా.. దాదాపు మూడు వారాల తర్వాత మార్చి 20న అతడి మరణ వార్త వెలుగులోకి వచ్చింది. పాషా అంత్యక్రియలు కూడా సౌదీ అరేబియాలోనే జరిగాయి. 

click me!