న్యూయార్క్ లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన తల్లీ, కూతుళ్లలో.. తల్లి మరణించగా, కూతురు పరిస్తితి విషమంగా ఉంది.
న్యూయార్క్ : ఓ విమాన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ మృతి చెందగా, ఆమె కూతురు తీవ్ర గాయాలతో విషమపరిస్థితుల్లో ఉంది. పైలట్ కూడా తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. అది డిమాన్ స్ట్రేషన్ ఫ్లైట్. దీంట్లో రోమా గుప్తా (63), ఆమె కుమార్తె రీవా గుప్తా (33), ఆదివారం ఈ చిన్న విమానంలో ట్రిప్ వేస్తుండగా.. లాంగ్ ఐలాండ్ సమీపంలో కూలిపోయింది. విమానం కూలడానికి ముందు కాక్‌పిట్‌లో పొగలు వచ్చాయి. ఈ మేరకు దాని పైలట్ తెలిపినట్లుగా న్యూయార్క్ టీవీ ఛానెల్ కథనం.
ప్రమాదానికి గురైన విమానం.. నాలుగు సీట్ల సింగిల్ ఇంజిన్ పైపర్ చెరోకీ విమానం.. లాంగ్ ఐలాండ్‌లోని రిపబ్లిక్ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వస్తుండగా మంటల్లో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. రోమాగుప్తా మరణించింది. కుమార్తె రీవా, 23 ఏళ్ల పైలట్ శిక్షకుడు తీవ్రమైన కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నార్త్ లిండెన్‌హర్స్ట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కెన్నీ స్టాలోన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదంలో వీరిద్దరూ రోగులు తీవ్రంగా గాయపడ్డారు. విమానం కూలిన తరువాత ఓ పౌరుడు వీళ్లను బైటికి తీయడంతో బతికారు’ అని చెప్పారు.
undefined
ఈ ప్రమాదంలో రోమా మృతి చెందింది. ఆమె కూతురు రీవాకు థర్డ్-డిగ్రీ కాలిన గాయాలతో స్టోనీ బ్రూక్ హాస్పిటల్‌లో పరిస్థితి విషమంగా ఉంది. రీవా మౌంట్ పిజీషియన్ అసిస్టెంట్ గా సినాయ్ సిస్టమ్‌లో పనిచేస్తోంది. దీన్నుంచి ఆమె కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని ఆమె సహచరులు అంటున్నారు. విమానాన్ని నడుపుతున్న ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సోమవారం విమానం యాజమాన్యంలోని డానీ వైజ్‌మాన్ ఫ్లైట్ స్కూల్ తెలిపింది.
డానీ వైజ్‌మాన్ ఫ్లైట్ స్కూల్ న్యాయవాది ఒలేహ్ డెకైలో మాట్లాడుతూ పైలట్ తన రేటింగ్‌లు, ధృవపత్రాలన్నింటినీ కలిగి ఉన్నాడు. క్రాష్ అయిన విమానం గత వారమే తనిఖీలు చేయబడింది. కూలిపోయిన విమానం ఒక డిమాన్ స్ట్రేషన్ విమానం.. ఫ్లయింగ్ పాఠాలు నేర్చుకోవడానికి ఆసక్తి ఉందో, లేదో తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు.
విమానం సౌత్ షోర్ బీచ్‌ల మీదుగా వెళ్లిందని అది వెళ్లిన రూట్ మ్యాప్ చూపిస్తుంది. ఆ సమయంలోనే పైలట్ క్యాబిన్‌లో పొగలు వస్తున్నట్లు తెలిపాడు. రిపబ్లిక్ ఎయిర్‌పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి రేడియోలో మెసేజ్ పంపాడని ఓ వెబ్‌సైట్ నివేదించింది. విమానం ఇటీవలే అనేక తనిఖీలను పూర్తి చేసుకుందని విమానం యజమాని తరఫు న్యాయవాది తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లడం కోసం విమాన శిధిలాలను తొలగించడానికి ఫెడరల్ పరిశోధకులు మంగళవారం మూడోసారి క్రాష్ సైట్‌కు తిరిగి వస్తారని భావిస్తున్నారు. ఈ ప్రమాదం తరువాత గుప్తా కుటుంబం కోసం రూపొందించిన GoFundMe ద్వారా 60,000 డాలర్ల కంటే ఎక్కువ వసూలయ్యాయి.