అమెరికాలో నేరం.. హైదరాబాద్‌ నుంచి స్కెచ్, వెలుగులోకి హెచ్ 1 బీ స్కాం

By Siva Kodati  |  First Published Jun 3, 2021, 6:45 PM IST

హైదరాబాద్ కేంద్రంగా హెచ్ 1 బీ వీసా స్కాం వెలుగుచూసింది. అమెరికాలో ఈ ఘరానా మోసం బయటపడింది. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి పాల్పడింది టెక్ కంపెనీ. టెక్సాస్‌లోని హోస్టన్ కోర్టులో ఈ మేరకు క్లౌడ్‌జెన్ కంపెనీ నేరాన్ని అంగీకరించింది.


హైదరాబాద్ కేంద్రంగా హెచ్ 1 బీ వీసా స్కాం వెలుగుచూసింది. అమెరికాలో ఈ ఘరానా మోసం బయటపడింది. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి పాల్పడింది టెక్ కంపెనీ. టెక్సాస్‌లోని హోస్టన్ కోర్టులో ఈ మేరకు క్లౌడ్‌జెన్ కంపెనీ నేరాన్ని అంగీకరించింది. థర్డ్ పార్టీ కోసం పని వుందంటూ ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చినట్లుగా దర్యాప్తులో తేలింది. కాంట్రాక్ట్ ఆధారంగా హెచ్ 1 బీ వీసాలు జారీ చేశారు.

అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పనివెతికే ప్రయత్నం చేసినట్లుగా తేలింది. అనంతరం అడిగిన కంపెనీకి హెచ్ 1 బీ వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేసేవారు. కమీషన్ల రూపంలో 2013-2020 మధ్య 5 లక్షల డాలర్లు వసూలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. క్లౌడ్‌జెన్ సంస్థ ప్రెసిడెంట్‌గా శశి పల్లెంపాటి, వైస్ ప్రెసిడెంట్‌గా జోమోన్ చక్కలక్కళ్. హైదరాబాద్ గచ్చిబౌలి, కెనడా, రొమేనియా దేశాల్లో కార్యాలయాలు వున్నాయి. కుంభకోణం నేపథ్యంలో గచ్చిబౌలిలోని క్లౌడ్‌జెన్ కార్యాలయాన్ని మూసివేశారు. 
 

Latest Videos

click me!