ఎన్ఆర్ఐల నంబర్లతో.. భారత్‌లో వున్న బంధువులకు ఎర: అత్యవసరమంటూ లక్షల్లో టోకరా

By Siva KodatiFirst Published May 27, 2021, 2:49 PM IST
Highlights

ఎంతగా నిఘా పెడుతున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో నేరాలు చేస్తూ భారీగా దోచుకుంటున్నారు. ఏకంగా ఎన్ఆర్ఐల పేరుతో వాట్సాప్ ఖాతా సృష్టించి... భారత్‌లోని వారి బంధువులను మోసం చేస్తున్నారు

ఎంతగా నిఘా పెడుతున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో నేరాలు చేస్తూ భారీగా దోచుకుంటున్నారు. ఏకంగా ఎన్ఆర్ఐల పేరుతో వాట్సాప్ ఖాతా సృష్టించి... భారత్‌లోని వారి బంధువులను మోసం చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన శ్రీరామ్‌ రూ. 10 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన నరేంద్ర రూ. 11 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్ నేరగాళ్ల మోసం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు ఫేసుబుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లలో అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐల గురించి సెర్చ్‌ చేస్తారు. అనంతరం వారి ఖాతాలను కొద్దిరోజుల పాటు ఫాలో అవుతారు. వారితో భారత్‌లో వున్నస్నేహితులు, బంధువులు, అయినవారు ఇలా ఎవరు టచ్‌లో వున్నారా అన్న దానిని ఆరా తీస్తారు.

Also Read:డేటింగ్‌ యాప్‌లో వేధిస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌కి నటి ఫిర్యాదు..

అనంతరం వారి ఫోన్‌ నంబర్లు సంపాదిస్తారు. అమెరికా నంబర్‌, అక్కడి ఫొటోతో ఉన్న వాట్సాప్‌ నుంచి వారికి మెసేజ్‌లు పంపుతారు. అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని, మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బు సర్దుబాటు చేయాలనిమెసేజ్‌లు పంపుతారు. దీంతో భారత్‌లో ఉన్న బంధువులు ఇది నిజమేనని నమ్మి వారు చెప్పిన ఖాతాల్లో రూ. లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.

ఆ తర్వాత అమెరికాలో ఉన్న తమవారికి ఫోన్‌ చేసి డబ్బులు అందాయా..? అని ఆరా తీయడంతో వీరి మోసం వెలుగులోకి వస్తుంది. తాము ఎలాంటి డబ్బులూ అడగలేదని, మీరు డబ్బులు పంపిన విషయమే తెలియదని చెప్పడంతో భారత్‌లో ఉన్న బంధువులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లు స్విచాఫ్‌ చేసి, ఖాతాలో వేసిన డబ్బును ఖాళీ చేస్తున్నారు.

click me!