పార్టీ కార్యకలాపాల గురించి, గల్ఫ్ దేశాలలో నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు.
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని రాజధాని అమరావతిలో ఆ పార్టీ కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు కలిశారు. ఈ సందర్భంగా వారు పార్టీ కార్యకలాపాల గురించి, గల్ఫ్ దేశాలలో నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా లోకేష్.. గల్ఫ్ పర్యటనకు రావాల్సిందిగా కోరారు. అంతేకాకుండా పలు వినతులను కూడా లోకేష్ కి తెలియజేశారు. కువైట్ లో మైనారిటీ సభ జరపటానికి అనుమతి కోరుతూ మైనారిటీ నాయకులను పంపాల్సిందిగా కోరారు. కాగా.. దీనికి లోకేష్ స్పందించి.. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి, మైనార్టీనాయకులను పంపించడానికి అంగీకరించారు.
undefined
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గల్ఫ్ లో నివసిస్తున్న తెలుగువారికి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తెలుగు రక్షణ వేధిక ఆధ్వర్యంలో కువైట్ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏపీఎన్ఆర్టీ ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ప్రవేశపెట్టిన భీమా పథకాన్ని మరియు ఇతర ఎన్ఆర్టీ కార్యక్రమాల గురించి చర్చించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ఇప్పటి నుంచే ప్రచారం చేయాల్సిందిగా లోకేష్ వారిని కోరారు. గల్ఫ్ లో ఉన్న అన్ని తెలుగుదేశం కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.
లోకేష్ తో పాటు ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్, వీవీ చౌదరి, షరీఫ్, హిదాయత్ లను కూడా ఆయన కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ అధికార ప్రతినిధి వంకీపురం సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.