ఆస్ట్రేలియాలో ఓ భారత విద్యార్థి మరణించాడు. డేటింగ్ సైట్ లో పరిచయమైన అమ్మాయిని కలిసిన తర్వాత అతను మృత్యువాత పడ్డాడు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ భారత విద్యార్థి మరణించాడు. డేటింగ్ సైట్ లో పరిచయమైన అమ్మాయిని కలిసిన తర్వాత అతను మృత్యువాత పడ్డాడు. ఆ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేసి, ఆమెపై అభియోగాలు మోపారు.
మౌలిన్ రాథోడ్ అనే పాతికేళ్ల భారత విద్యార్థి సోమవారం రాత్రి ఆ అమ్మాయి ఇంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు,
సోమవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు పశ్చిమ మెల్బోర్న్ లోని సన్ బరీ శివారులోని గల 19 ఏళ్ల వయస్సు గల అమ్మాయి ఇంటికి వెళ్లాడు. తీవ్రమైన గాయాలు కావడంతో మౌలిన్ రాథోడ్ ను అత్యవసర సర్వీసులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి తరలించారు.
టీనేజ్ అమ్మాయి తన గదిలో ఒంటరిగా ఉంటోంది. కావాలని రాథోడ్ ను తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిని మెల్బోర్న్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
తల్లిదండ్రులకు రాథోడ్ ఒక్కడే సంతానం. నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆస్ట్రేలియా వచ్చాడు. అతను క్రికెట్ అభిమాని.