అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కూతుళ్లు మృతి

By Sumanth KanukulaFirst Published Sep 27, 2022, 11:05 AM IST
Highlights

అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఈ ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. 

అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఈ ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. వివరాలు.. ఏపీలోని పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్.. గుంటూరు మెడికల్‌ కాలేజ్ వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి 1995లో అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబం హ్యూస్టన్‌లో స్థిరపడింది. నాగేంద్ర శ్రీనివాస్ పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. తానా బోర్డు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆయనకు భార్య వాణి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాణి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కూతురు వైద్య విద్యను అభ్యసిస్తోంది. చిన్న కూతురు 11వ తరగతి చదువుతోంది. ఆదివారం రోజున కూతుళ్లను కాలేజ్ నుంచి తీసుకురావడానికి వాణి కారులో వెళ్లారు. అయితే కుమార్తెలను కళాశాల నుంచి తీసుకువస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును వ్యాను వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. భార్య, ఇద్దరు కూతుళ్లను కోల్పోవడంతో నాగేంద్ర శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. 

click me!