ఒకే వ్యక్తి వీర్యదానం..50మంది సంతానం..చివరకు

By ramya NFirst Published Mar 21, 2019, 9:52 AM IST
Highlights

పిల్లలు పుట్టనివారు.. ఆధునిక పద్ధతుల ద్వారా పిల్లలను కంటున్న సంగతి మనకు తెలిసిందే.  అందులో స్పెర్మ్ డోనార్ విధానం కూడా ఒకటి. 

పిల్లలు పుట్టనివారు.. ఆధునిక పద్ధతుల ద్వారా పిల్లలను కంటున్న సంగతి మనకు తెలిసిందే.  అందులో స్పెర్మ్ డోనార్ విధానం కూడా ఒకటి. మన దేశంలో ఈ విధానాన్ని పెద్దగా ప్రోత్సహించరు కానీ.. అమెరికా లాంటి దేశాల్లో ఇది చాలా కామన్. భర్త ద్వారా పిల్లలు కలగని స్త్రీలకు .. ఆరోగ్యంగా ఉన్న యువకుల స్పెర్మ్ ని ఎక్కిస్తారు. దాంతో.. వారు మాతృత్వాన్ని పొందగలరు.

అయితే.. ఇప్పుడు విషయం ఏమిటంటే.. కేవలం ఒక్క వ్యక్తి వీర్యంతో.. 50మందికి పైగా మహిళలు సంతానోత్పత్తి పొందారు. వారి సంతానం 40ఏళ్ల తర్వాత తమ తండ్రి ఒక్కరే అని తెలుసుకొని షాక్ కి గురయ్యారు. 1960 నుంచి 1970ల మధ్య ఈ విధంగా పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు అమెరికాలో వివిధ ప్రదేశాల్లో స్థిరపడ్డారు.

 అయితే దాదాపు 40 ఏళ్ల తరువాత వారికి జన్మించిన పిల్లలందరికీ వీర్యం దానం చేసింది ఒకరనే విషయం తెలిసింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా వారి తండ్రి వేరొకరు అనే నిజం బయటపడింది. 40 ఏళ్ల క్రితం మహిళలు సంతానోత్పత్తి కోసం సంప్రదించిన ఫెర్టిలిటీ ఆసుపత్రిలోని డాక్టర్ డొనాల్డ్ క్లైన్ ఈ పిల్లలకు తండ్రి కావడం విశేషం.

అమెరికాలోని కొన్ని డీఎన్‌ఏ వెబ్‌సైట్ల ద్వారా ఒకే డీఎన్ఏ కలిగిన వారందరూ కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడి తమ పుట్టుకకు కారణం ఒకరేనని తెలుసుకున్నారు. ఒక యువతి తన డీఎన్ఏతో మరొకరి డీఎన్ఏ మ్యాచ్ అయ్యిందని తెలుసుకుని ఆ యువతిని ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసింది. సేమ్ టూ సేమ్ తనలాగే ఉండటంతో ఈమె తనకు అక్క అనే పరిస్థితికి వచ్చేసింది.

ఇలా వారిద్దరూ మిగతా వాళ్ల డీఎన్ఏలను పరీక్షిస్తూ ఏకంగా ఓ కుటుంబంగా తయారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఎవరో బయటి డొనార్ అనుకున్నామని.. డాక్టర్ తన సొంత వీర్యాన్ని దానం చేసినట్టు తమకు తెలియదని చెప్పారు. కాగా, ఈ నేరానికి పాల్పడిన ఫెర్టిలిటీ డాక్టర్‌కు సంవత్సరం పాటు జైలు శిక్షను విధించారు. ఇండియానా చట్టాల ప్రకారం ఫెర్టిలిటీ డాక్టర్లు ఇలాంటి వాటికి పాల్పడటం పెద్ద నేరమేమి కాదు
 

click me!