అమెరికాలో మరో భారతీయుడి హత్య: కత్తితో పొడిచి తెర్లీక్ సింగ్ మర్డర్

First Published 17, Aug 2018, 1:52 PM IST
Highlights

 అమెరికాలోని న్యూజెర్సీలో  భారత్ కు చెందిన ఓ సిక్కు తెర్లీక్ సింగ్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


న్యూయార్క్:  అమెరికాలోని న్యూజెర్సీలో  భారత్ కు చెందిన ఓ సిక్కు తెర్లీక్ సింగ్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తెర్లీక్ సింగ్ ‌ను అతడి దుకాణంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు.  తెర్లీక్ సింగ్ న్యూజెర్సీలో ఓ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తెర్లీక్ సింగ్ భార్య, పిల్లలు న్యూఢిల్లీలో ఉంటున్నారు. 

ఈ స్టోర్‌లో వస్తువులను కొనుగోలు చేసేందుకు  స్టోర్‌కు వెళ్లి పిలిచేసరికి ఎవరూ పలకలేదు. కౌంటర్ సమీపంలో  తెర్లీక్ సింగ్ మృతదేహం కన్పించిందని ప్రత్యక్షసాక్షి తెలిపారు.

తెర్లీక్ సింగ్ చాలా మంచి వ్యక్తని స్థానికులు చెప్పారు. ఎవరికీ కూడ హానీ తలపెట్టడని చెప్పారు.  ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఏడుగంటల వరకు అతను పనిచేస్తాడని స్థానికులు చెప్పారు.

న్యూజెర్సీలో ఇప్పటికే ముగ్గురు భారతీయులు హత్యకు గురయ్యారు.  వరుస హత్యలతో అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ల గురించి ఇండియాలోని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Last Updated 9, Sep 2018, 11:31 AM IST