సెలవులకు ఇండియా వచ్చి... మహిళ ఆత్మహత్య

By telugu team  |  First Published Jul 4, 2019, 11:07 AM IST

సెలవల్లో ఆనందంగా గడుపుదామని ఇండియా వచ్చింది. కానీ... కుటుంబంలో విషాదం నింపి వెళ్లిపోయింది. అమెరికా నుంచి ఇండియా వచ్చి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్ సుఖ్ నగర్ లో చోటుచేసుకుంది.
 


సెలవుల్లో ఆనందంగా గడుపుదామని ఇండియా వచ్చింది. కానీ... కుటుంబంలో విషాదం నింపి వెళ్లిపోయింది. అమెరికా నుంచి ఇండియా వచ్చి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్ సుఖ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడ గాంధీనగర్‌కు చెందిన గుర్రం ఎన్‌వి సురేష్‌ అమెరికాలోని టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. సిరిసిల్ల గంభీరావుపేటకు చెందిన శ్రీలేఖతో 2004లో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా వీరు అమెరికాలోని టెక్సాలో స్థిరపడ్డారు. వీరికి 11 సంవత్సరాల ధీరజ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే... ధీరజ్ కి పుట్టిన ప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో... కుమారుడి అనారోగ్యం గురించి శ్రీలేఖ నిత్యం మదనపడేది. 

Latest Videos

ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఆమె మానస్థితి దెబ్బతిన్నంది.  కాగా... ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె... ఇంటి బాల్కనీలో నుంచి కింద కి దూకి ఆత్మహత్య చేసుకుంది. అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ చూసి భర్త సురేష్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన కిందకు చేరుకునే సరికి అప్పటికే నెత్తుటి మడుగులో మృతదేహం పడి ఉంది. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!