అమెరికాలో భార్యను చంపిన ఇండియన్ డ్రైవర్.. అరెస్ట్

By telugu teamFirst Published Jul 3, 2019, 2:00 PM IST
Highlights

అమెరికాలో భార్య, ముగ్గురు ఇతర కుటుంబసభ్యులను అతి దారుణంగా హత్య చేసిన ఇండియన్ ట్రక్కు డ్రైవర్ ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 

అమెరికాలో భార్య, ముగ్గురు ఇతర కుటుంబసభ్యులను అతి దారుణంగా హత్య చేసిన ఇండియన్ ట్రక్కు డ్రైవర్ ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన గురుప్రీత్ సింగ్.. అమెరికాలో వోహియో ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను వెస్ట్ చెస్టర్ అపార్ట్ మెంట్ లో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు.  ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన తన కుటుంబసభ్యులు నలుగురు రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారంటూ గురు ప్రీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు వచ్చి పరిశీలించగా వారు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.

మృతులు షలీందర్ జిత్ కైర్(39), అమర్ జిత్ కౌర్(58), పరంజిత్ కౌర్(62), హక్కియాత్ సింగ్ పన్నాగ్(59)గా పోలీసులు గుర్తించారు. ఆ నలుగురు తుపాకీతో కాల్చడం కారణంగానే  చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. గురుప్రీత్ సింగ్ షలీందర్ జిత్ ల వివాహం 17 సంవత్సరాల క్రితం జరగగా వారికి ముగ్గురు సంతానం కూడా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

భార్య షలీందర్ జిత్ ని, ఆమె తల్లిదండ్రులు అమర్ జిత్ కౌర్, హక్కియాత్ సింగ్ పన్నాగ్, ఆమె బంధువు పరంజిత్ కౌర్ లను గురుప్రీత్ సింగ్ పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో గరుప్రీత్ సింగ్ అసలు నేరస్తుడన్న విషయం తేలింది. దీంతో తాజాగా అతనిని అరెస్టు చేశారు. ఒక్కొక్కరిని తుపాకీతో రెండు రెండు సార్లు కాల్చిచంపినట్లు పోలీసులు చెప్పారు. 

click me!