హెచ్1బీ వీసా మోసం... నలుగురు ఎన్ఆర్ఐలు అరెస్ట్

By telugu teamFirst Published Jul 3, 2019, 11:30 AM IST
Highlights

హెచ్1 బీ మోసాలకు పాల్పడుతున్న నలుగురు ఎన్ఆర్ఐలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 


హెచ్1 బీ వీసా మోసాలకు పాల్పడుతున్న నలుగురు ఎన్ఆర్ఐలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియాలోని రెండు వేర్వేరు ఐటీ కంపెనీలకు చెందిన విజయ్ మానే(39), ఫెర్నాండో సిల్వా(53), సతీష్ వేమూరి(52), వెంకట రమణ మన్నెం(47) లను మంగళవారం అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే... వారు వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారు. రూ.2.5లక్షల పూచీ కత్తుతో వారికి బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించింది. కాగా ఈ నలుగురు కలిసి న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌, క్లైంట్‌ ఏ, కాలిఫోర్నియా కేంద్రంగా క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరిట ఐటీ స్టాఫింగ్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం పొందాలనుకున్న విదేశీయులకు హెచ్‌1 బీ వీసా ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా హెచ్‌1బీ వీసా జారీచేస్తుందన్న సంగతి తెలిసిందే.

click me!