అమెరికాలో పట్టపగలే దొంగల బీభత్సం.. దోపిడీ, కాల్పుల్లో భారతీయుడు మృతి...

By SumaBala BukkaFirst Published Dec 9, 2021, 12:07 PM IST
Highlights

ఇటీవల అమెరికాలో దోపిడి దారులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దారుణాలకు తెగబడుతున్నారు. నవంబర్ 17న టెక్సాస్ లో జరిగిన దాడిలో సజన్ మథ్యూ అనే అమెరికన్ భారతీయుడు మృతి చెందాడు. ఈ ఘటన మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది. 
 

అమెరికాలో పట్టపగలే జరిగిన Robberyలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. Georgia రాష్ట్రంలో మస్కోజీ కౌంటీ, ఈస్ట్ కోలంబస్ రోడ్డులో ఉన్న సైనోవస్ బ్యాంకు దగ్గర సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దోపిడి చోటు చేసుకుంది. అమెరికాలో స్థిరపడిన indian అమిత్ కుమార్ పటేల్ మరణించాడు.

అమిత్ కుమార్ పటేల్ భార్య పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. పట్టణంలోని బ్యూనా విస్టారోడ్, స్టీమ్ మిల్ రోడ్డులో గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి. కాగా నగదు జమ చేసేందుకు ఆయన సోమవారం bank వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు జరిపిన firingల్లో అమిత్ కుమార్ చనిపోయారు. అనంతరం దుండగుడు నగదుతో పరార్ అయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. 

ఇటీవల అమెరికాలో దోపిడి దారులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దారుణాలకు తెగబడుతున్నారు. నవంబర్ 17న టెక్సాస్ లో జరిగిన దాడిలో సజన్ మథ్యూ అనే అమెరికన్ భారతీయుడు మృతి చెందాడు. ఈ ఘటన మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది. 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 1న వాషింగ్టన్ లో కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్ హైస్కూల్‌లో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి మంగళవారం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు టీనేజర్లు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఆ తరువాత ఆ విద్యార్థి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు  US పాఠశాల జరిగిన కాల్పుల్లో ఇది అత్యంత ఘోరమైనది.

ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో తరగతులు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడితో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని ఓక్‌లాండ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. మృతులు 16 ఏళ్ల పురుషుడు, 14 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

జూకర్ బర్గ్ దంపతుల దాతృత్వం.. రెండున్నర లక్షల కోట్ల విరాళాలు.. మొదటి విడతగా రూ. 25 వేల కోట్లు దానం..

క్షతగాత్రులలో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరికి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సెమీ ఆటోమేటిక్ చేతి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు, అయితే డెట్రాయిట్‌కు ఉత్తరాన 40 మైళ్ల (65 కిలోమీటర్లు) దూరంలో ఉన్న ఈ చిన్న ఆక్స్‌ఫర్డ్ అనే పట్టణంలో దాడి జరగడానికి ఎలాంటి కారణాలున్నాయనేది ఇంకా తెలియరాలేదు. 

అనుమానితుడిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఎలాంటి ప్రతిఘటన చేయలేదని పోలీసులు తెలిపారు. అతను తనకు లాయర్ కావాలని అడిగాడు. అంతేకానీ కాల్పులకు గల కారణాలు తెలుపలేదు.. అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది. అయితే ఈ ఘటన "ఇది చాలా విషాదకరమైనది" అని అండర్‌షరీఫ్ మైఖేల్ మెక్‌కేబ్ విలేకరులతో అన్నారు.

"ప్రస్తుతం ముగ్గురు మరణించడం మమ్మల్ని చాలా బాధిస్తుంది. వీరంతా విద్యార్థులేనని అనుకుంటున్నాం’ అన్నారు. అంతేకాదు ఈ ఘటనతో ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కూడా ఆయన అన్నారు. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత పోలీసులకు 100 911 పైగా emergency callsలు వచ్చాయని, ఐదు నిమిషాల వ్యవధిలో షూటర్ 15-20 రౌండ్ల కాల్పులు జరిపాడని మెక్‌కేబ్ చెప్పారు. ////మొదటి 911 కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

click me!