గత నెలలో అదృశ్యమైన మహిళ కారులో శవమై తేలింది

By telugu team  |  First Published Jan 17, 2020, 12:58 PM IST

గత నెల నుంచి కనిపించకుండా పోయిన ఇండియన్ అమెరికన్ మహిళ సురీల్ డాబావాలా తన సొంత కారులోనే శవమై తేలింది. సురీల్ శవం బ్లాంకెట్ లో చుట్టి కారు ట్రంకులో కనిపించింది.


వాషింగ్టన్: గత నెల 30వ తేదీన కనిపించకుండా పోయిన ఇండియన్ అమెరికన్ తన కారులోనే శవమై తేలింది. కారు ట్రంకులో ఆమె శవం కనిపించింది. డిసెంబర్ 30వ తేదీన అదృశ్యమైన సురీల్ డాబావాలా (34) తిరిగి ఇంటికి రాలేదు. 

మీడియా కథనాల ప్రకారం.... సురీల్ డాబావాలా చికాగోలోని లయోలా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివంది. ఆమె 2019 డిసెంబర్ 30వ తేదీన కనిపించకుండా పోయిందని అమెరికన్ బజార్ గురువారంనాడు రిపోర్టు చేసింది. 

Latest Videos

undefined

అదృశ్యమైనప్పటి నుంచి గాలిస్తుండగా చివరికి బ్లాంకెట్ లో చుట్టిన ఆమె శవం కారులోని ట్రంకులో సోమవారం చికాగోలోని వెస్ట్ గార్ ఫీల్డ్ పార్కు వద్ద కనిపించింది. కుటుంబ సభ్యులు నియోగించుకున్న ప్రైవేట్ దర్యాప్తు అధికారులు ఆమె శవాన్ని గుర్తించారు. 

గుజరాత్ కు చెందిన అష్రాఫ్ డాబావాలాకు ఫిజిషియన్ గా ఆ ప్రాంతంలో మంచి గౌరవం ఉంది. అతని కూతురే సురీల్. డాబావాలా కుటుంబ సభ్యులు ప్రేమగా, మర్యాదగా ఉంటారని ఆ ప్రాంతంలోని భారతీయులు చెబుతున్నారు.  

సురీల్ ను గుర్తించి తమకు సమాచారం ఇచ్చినవారికి 10 వేల డాలర్ల బహుమతి ఇస్తామని కూడా డాబావాలా కుటుంబ సభ్యులు ప్రకటించారు. సురీల్ మృతికి కారణమేమిటనేది తెలియదు. టాక్సీకాలజీ నివేదికలు వస్తే మరణానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. అందుకు నెల రోజులు పట్టే అవకాశం ఉంది.

click me!