అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం.. కడసారి చూపుకై తల్లిదండ్రుల ఎదురుచూపు

Siva Kodati |  
Published : Jun 19, 2021, 09:15 PM IST
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం.. కడసారి చూపుకై తల్లిదండ్రుల ఎదురుచూపు

సారాంశం

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో తెలుగు యువకుడు మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్ అమెరికాలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో తెలుగు యువకుడు మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్ అమెరికాలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. మూడేళ్లుగా ఆయన అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో రవికుమార్ స్నేహితులతో కలిసి బీచ్‌లో బోటింగ్‌కు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ నీటిలో పడి మరణించాడు.

Also Read:భారత సంతతి వధూవరులు.. దక్షిణాఫ్రికాలో మృతి

కోదాడలో వుంటున్న రవికుమార్ తల్లిదండ్రులకు అతని మిత్రుడు ఈ విషయం చెప్పడంతో వారు విషాదంలో మునిగిపోయారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండటం, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం వుండటంతో అతని మృతదేహం భారతదేశానికి రావడం క్లిష్టంగా మారింది. దీంతో కన్నకొడుకుని కడసారి చూపించాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను రవికుమార్ తల్లిదండ్రులు కోరుతున్నారు. అతని మరణవార్తతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..