కేరళకు చెందిన అనిల్, ఆయన భార్య నిను దుబాయ్‌లోని ఉమ్ అల్ క్విన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు.
కట్టుకున్న భార్యను కాపాడుకునే ప్రయత్నంలో ఓ భర్త తన ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అనిల్, ఆయన భార్య నిను దుబాయ్‌లోని ఉమ్ అల్ క్విన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు.
Also Read:దుబాయ్ లో తెలంగాణ వాసి ఆత్మహత్య
undefined
ఈ నేపథ్యంలో గత సోమవారం వీరి అపార్ట్‌మెంట్ కారిడార్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న నీను అరుపులు విన్న అనిల్ ఆమెను కాపాడేందుకు వెళ్లి తాను కూడా మంటల్లో చిక్కుకున్నాడు.
వీరిద్దరి కేకలు విన్న స్థానికులు మంటలను అదుపు చేసి ఇద్దరిని అబుదాబిలోని మఫ్రాక్ ఆసుపత్రికి తరలించారు. నీను ఆరోగ్యం నిలకడగా ఉండగా.. 90 శాతం గాయాలతో అనిల్ పరిస్ధితి అత్యంత విషమంగా ఉంది.
Also Read:జర్మనీలో తెలుగు విద్యార్థి మోహన్ రెడ్డి ఆత్మహత్య
అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అనిత్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. వీరి నాలుగేళ్ల కుమారుడు సైతం అగ్నిప్రమాదంలో స్వల్పంగా గాయపడటంతో చిన్నారిని మెరుగైన వైద్యం కోసం అబుదాబిలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అనిల్ మరణంతో అతని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.