విజయవాడ:జర్మనీలో  తెలుగు విద్యార్థి లోకసాని మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సమాచారాన్ని తోటి విద్యార్థులు మృతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

 ఉన్నత చదువుల కోసం  మోహన్ రెడ్డి జర్మనీకి వెళ్లాడు. అయితే జర్మనీలో ఉంటున్న మోహన్ రెడ్డి భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గుంటూరు  జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి ఎంఎస్ చదివేందుకు జర్మనీకి వెళ్లాడు. 

మోహన్ రెడ్డి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయమై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.