అమెరికాలో దారుణం: భార్యను చంపి ఎన్నారై భర్త ఆత్మహత్య

Published : Apr 28, 2020, 07:18 AM ISTUpdated : Apr 28, 2020, 07:19 AM IST
అమెరికాలో దారుణం: భార్యను చంపి ఎన్నారై భర్త ఆత్మహత్య

సారాంశం

ఎన్నారై దంపతులు అమెరికాలోని జెర్సీ సిటీలో దారుణమైన స్థితిలో మరణించారు. భార్యను చంపేసి భర్త ఆత్మహత్య చేసుకుని వుండవచ్చునని అనుమానిస్తున్నారు. వారిద్దరు రెస్టారెంట్ నడుపుతూ వస్తున్నారు.

జెర్సీ సిటీ: అమెరికాలోని జెర్సీ సిటీలో భారతీయ దంపతులు విగతజీవులై కనిపించారు. భారతీయుడైన వ్యక్తి తొలుత తన భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గరిమా కొఠారి, మన్మోహన్ మాల్ అనే ఎన్నారై జంట న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో నివసిస్తున్నారు.

ఆదివారం ఉదయం 7.15 గంటలకు గరిమ తన ఇంట్లో శవమై కనిపించింది. ఆమె ఒంటిపై భయం గొలిపితే రీతిలో గాయాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అరగంటకు సమీపంలోని హడ్సన్ నదిలో మన్మోహన్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. 

పదేళ్ల క్రితం మన్మోహన్ మాస్టర్స్ చేసేందుకు అమెరికా వచ్చాడు. కొన్నేళ్ల తర్వాత గరిమా కూడా అమెరికా వచ్చి స్థిరపడింది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి నుక్కడ్ అనే ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్నారు. గరిమా మంచి చెఫ్ అని చెబుతున్నారు. ఆమె ఐదు నెలల గర్భవతి అని కూడా సమాచారం.

వారిద్దరి మరణానికి సంబంధించి స్పష్టత రాలేదు. మన్మోహన్ భార్య గరిమను చంపి తను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. భారత్ లో ఉన్న బంధువులకు కూడా వారు ఎందుకు మరణించారనేది తెలియడం లేదు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..