దుబాయ్: భార్యను కాన్పు కోసం భారత్‌కు పంపి... నిద్రలోనే కన్నుమూసిన యువ టెక్కీ

By Siva KodatiFirst Published Jun 9, 2020, 4:24 PM IST
Highlights

దుబాయ్‌లో భారతదేశానికి చెందిన ఓ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌క్ చెందిన నితిన్ చంద్రన్ దుబాయ్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

దుబాయ్‌లో భారతదేశానికి చెందిన ఓ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌క్ చెందిన నితిన్ చంద్రన్ దుబాయ్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

అతని భార్య అథిరా గీతా శ్రీధరన్‌తో కలిసి ఆయన అక్కడే నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గీత వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

Also Read:ప్రపంచంలో కరోనా కేసుల పెరుగుదలపై డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్

ఆ సమయంలో అథిరా ఆరు నెలల గర్బిణీ. అయితే జూలైలో తనకు డెలీవరి జరగనుందని, అందువల్ల తనను భారతదేశానికి వచ్చేందుకు అనుమతించాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

లాక్‌డౌన్‌లోనూ తన భర్తకు మినహాయింపు ఇవ్వలేదని అందువల్ల చూసుకోవడానికి ఎవరూ లేరంటూ వాపోయింది. అయితే ఆ కేసు సుప్రీం దగ్గర ఉండగానే.. దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ చొరవ తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం భారతీయుల తరలింపుకు ఉద్దేశించిన వందే భారత్ మిషన్‌లో అథిరాకు తొలి ప్రాధాన్యతను ఇచ్చారు. మే 7న ఆమెను కేరళకు పంపారు. అయితే ఉద్యోగం నేపథ్యంలో నితిన్ దుబాయ్‌లోనే ఉండిపోయాడు.

Also Read:కరోనాని జయించిన న్యూజిలాండ్... పాజిటివ్ కేసులు జీరో..!

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అతను గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసినట్లు స్థానిక మీడియా కథనాన్ని ప్రసారం చేసింది. ఆయన మరణం తనను కలిచివేసిందని భారత కాన్సుల్ జనరల్ విపుల్ అన్నారు.

దుబాయ్‌తో పాటు కేరళలోనూ నితిన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడని ఆయన మిత్రులు చెబుతున్నారు. కాగా కోవిడ్ 19 పరీక్షల నిమిత్తం నితిన్ చంద్రన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 
 

click me!