యూకేలో ఇండియన్ డాక్టర్ అనుమానాస్పద మృతి

By telugu news teamFirst Published May 30, 2020, 11:18 AM IST
Highlights

నాలుగు రోజుల క్రితం రాజేష్‌ గుప్తా హోటల్‌ గదిలో మరణించాడు. అతని ఆకస్మిక మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది.

యూకేలో భారత సంతతికి చెందిన ఓ వైద్యుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. సదరు భారతీయ వైద్యుడు అక్కడి కరోనా రోుగులకు వైద్యం అందిస్తున్నాడు. అనుకోకుండా హోటల్ గదిలో శవమై తేలాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్‌ రాజేష్‌ గుప్తా ఆగ్నేయ ఇంగ్లండ్‌ బెర్క్‌షైర్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ట్రస్ట్‌ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వెక్షం పార్క్ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌ కన్సల్టెంట్‌‌(మత్తుమందు)గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పేషంట్లకు వైద్యం చేస్తుండటంతో కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి సమీపంలోని ఓ హోటల్‌లో రాజేష్‌ గుప్తా ఒక్కరే ఉంటున్నారు.

ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రాజేష్‌ గుప్తా హోటల్‌ గదిలో మరణించాడు. అతని ఆకస్మిక మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన మరణానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదమా, ఆత్మహత్మో, హత్యో తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా  ఫ్రిమ్లీ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘మా సహోద్యోగి డాక్టర్‌ రాజేష్‌ గుప్తా సోమవారం మధ్యాహ్నం వరకు మాతో కలిసి కరోనా పేషంట్లకు వైద్యం చేశారు. విధులు ముగిసిన తర్వాత ఆయన బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. తర్వాత ఆయన మరణించినట్లు తెలిసింది. రాజేష్‌ అద్భుతమైన కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, వంట బాగా చేస్తాడు. చాలా ఉత్సాహవంతడు. మంచికి మానవత్వానికి ప్రతీకలాంటి వాడు. అతను అనేక పుస్తకాలు రాశాడు.. ఇతరుల రచనలకు సహకరించాడు. అతడి ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అతడిని చాలా మిస్‌ అవుతున్నాం’ అని ప్రకటనలో తెలిపింది.

click me!