గడువు పొడిగింపు: ఈబీ-5 వీసా కోసం ఈ దఫా దరఖాస్తుల్లో రికార్డు?

By sivanagaprasad kodatiFirst Published Oct 1, 2018, 8:02 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఫస్ట్ అమెరికన్’ నినాదం.. హెచ్ 1 బీ వీసాపై పని చేస్తున్న భారతీయ టెక్కీలకు సానుకూల వాతావరణం కల్పించే అవకాశం ఉంది. అది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా.. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే భారతీయులకు శుభవార్త. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఫస్ట్ అమెరికన్’ నినాదం.. హెచ్ 1 బీ వీసాపై పని చేస్తున్న భారతీయ టెక్కీలకు సానుకూల వాతావరణం కల్పించే అవకాశం ఉంది. అది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా.. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే భారతీయులకు శుభవార్త.

ప్రస్తుతం ఉన్న ఈబీ-5 వీసా పెట్టుబడి పథకాన్ని డిసెంబర్ 7 వరకు అమెరికా ప్రభుత్వం వాయిదా వేసింది. ఈబీ-5 ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 లక్షల డాలర్లు (రూ.7.2 కోట్లు), ప్రత్యేక ప్రాంతాల్లో అయితే 5 లక్షల డాలర్లు (3.6 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. 

ఏళ్ల తరబడి ఇదే మొత్తం పెట్టుబడి కొనసాగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచాలని ఒబామా హయాంలో ఓ బిల్లును తీసుకొచ్చారు. దాని ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని 18 లక్షల డాలర్లు (రూ.12.96 కోట్లు) ప్రత్యేక ప్రాంతాల్లో 13.5 లక్షల డాలర్ల (రూ.9.72 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు.

కాగా ఈ పెంపు ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్ 7 వరకు వాయిదా వేసింది. మున్ముందు ఈ పథకం పెట్టుబడి సామర్థ్యం పెంచే అవకాశం పుష్కలంగా ఉన్నది.

కానీ ప్రభుత్వం గడువు పొడిగించడంతో పాత పెట్టుబడితోనే ఈబీ-5 వీసాను పొందే అవకాశం భారతీయులకు ఏర్పడింది. త్వరలో ఈబీ-5 వీసా పెట్టుబడి భారీగా పెరుగుతుండటంతో భారతీయులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఈబీ- 5 ప్రోగ్రాం కింద వీసా పొందిన విదేశీ ఇన్వెస్టర్లకు గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశీ ఇన్వెస్టర్లు స్థానిక అమెరికన్లకు 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఒక రీజనల్ సెంటర్ ద్వారా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అది బిజినెస్ ప్రాజెక్టుల్లో స్పాన్సర్లుగా మారుతుంది. ఒక స్వంత సంస్థ ఏర్పాటు చేసేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తుంటారు. 

ఏటా ఈబీ -5 స్కీం కింద పది వేల మందికి వీసాలు జారీ చేస్తుంది అమెరికా. అయితే ప్రతి దేశానికి 700 మంది (7%) మాత్రమే ఈబీ -5 స్కీం కింద వీసాలు జారీ చేస్తుంది. ఒకవేళ నిర్దేశిత పరిమితికి అనుగుణంగా ఒక దేశం నుంచి వీసా దరఖాస్తులు రాకపోతే మిగిలిపోయిన వాటాను ఇతర దేశాలకు పున: పంపిణీ చేస్తారు. 

గతేడాదిలో ఈబీ - 5 వీసాలు 93 శాతం వీసాలను భారతీయులు పొందారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా 307 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెలిపింది. భారతదేశం నుంచి 1000 దరఖాస్తులు దాటతాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈబీ - 5 వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్న భారతీయ అప్లికెంట్లకు 18 నుంచి 24 నెలల పాటు షరతులతో కూడిన శాశ్వత నివాస హోదా లభిస్తుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్ పిల్లలు అవివాహితులై ఉండాల్సిందేనని తెలిపారు.

తర్వాత ఇన్వెస్టర్ హోదా లభిస్తుంది. రెండేళ్ల తర్వాత సదరు ఇన్వెస్టర్లు తనపై ఉన్న షరతులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత కొద్ది రోజులకు గ్రీన్ కార్డు లభిస్తుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ గడువు పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈబీ వీసా పొందిన వారిలో అత్యధికుల్లో భారతీయులే కావడం గమనార్హం. వారిలో అమెరికాలో పని చేస్తున్న వారైనా కావాలి. వారి పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న వారై ఉండాలి.

హెచ్ 1 బీ వీసా జారీకి ఆటంకాలు ఏర్పడటంతోపాటు జీవిత భాగస్వాములకు కల్పించిన హెచ్ -4 వీసాలను రద్దు చేసే అవకాశాలు పెరిగిపోవడంతో భారతీయులు ఈబీ-5 వీసాల కోసం దరఖాస్తులు పెరిగిపోయాయని నిపుణులు చెబుతున్నారు. 

click me!