ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన దుబాయ్ కి చెందిన ఓ ఎన్నారైని మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి తిరిగి వస్తున్న నిందితున్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు గుర్తించి మల్కాజ్ గిరి పోలీసులకు అప్పగించారు.
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన దుబాయ్ కి చెందిన ఓ ఎన్నారైని మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి తిరిగి వస్తున్న నిందితున్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు గుర్తించి మల్కాజ్ గిరి పోలీసులకు అప్పగించారు.
ఈ కేసుకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సప్దార్ అబ్బాస్ జైదీ(30) హైదరాబాద్ లోని దారుషిఫా నివాసి. ఇతడు గతంలో సోమాజి గూడలోని ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగితో ప్రేమాయనం కొనసాగించాడు. వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు పెళ్లికి కూడా అంగీకరించారు. అతన్ని పెళ్లాడటానికి ఆమె ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించింది.
undefined
అయితే ఈ సమయంలోనే అంటే 2014లో వీరిద్దరికి దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్లిన వీరి జీవితం కొన్నాళ్లు సాపిగానే సాగింది. అయితే రాను రాను జైదీ యువతిపై విపరీతమైన ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. దీన్ని తట్టుకోలేక సదరు యువతి 2018 లో ఇండియాకు వచ్చేసింది. దీంతో ఆమెను పెళ్ళి చేసుకోడానికి జైదీ నిరాకరించాడు. అతన్ని ఒప్పించడానికి ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
చివరకు అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి గత పిబ్రవరిలో మల్కాజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు జైదీ పై సెక్షన్ 376(రేప్), 420(చీటింగ్) కేసులు నమోదు చేశారు. అతడి కోసం టుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం జైదీ దుబాయ్ నుండి హైదరాబాద్ కు రావడంతో గుర్తించిన విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని మల్కజ్ గిరి పోలీసులకు అప్పగించారు.