అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు షాక్: అక్టోబర్ 1 నుండి ఇంటికే

By narsimha lode  |  First Published Sep 27, 2018, 5:54 PM IST

హెచ్ 1 బీ వీసాపై అమెరికా వెళ్లిన నిపుణులు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొనేద అవకాశం నెలకొంది.వీసా గడువు తీరిపోయిన టెక్కీలు ఇక ఇంటి దారి పట్టాల్సిందే.


న్యూయార్క్: హెచ్ 1 బీ వీసాపై అమెరికా వెళ్లిన నిపుణులు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొనేద అవకాశం నెలకొంది.వీసా గడువు తీరిపోయిన టెక్కీలు ఇక ఇంటి దారి పట్టాల్సిందే.ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త నిబంధనలను అమెరికాలోని ట్రంప్ సర్కార్ అమలు చేస్తోంది. దీంతో వేలాది మంది ఇండియన్ టెక్కీలకు ఇబ్బందులు తప్పేలా లేవు.

వీసా గడువు తీరిన వారు వీసా పొడిగింపు కోసం ధరఖాస్తు చేసుకోవాలి. అలా ధరఖాస్తు చేసుకొన్నవారికి ఏదైనా కారణాలతో వీసా రద్దైతే  దేశం విడిచిపెట్టాల్సిందే. వీసా గుడువు తీరినా అమెరికాలోనే కొనసాగితే  దేశం నుండి బహిష్కరించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకొంది. కొత్త చట్టం 2018 అక్టోబర్1 నుండి అమల్లోకి రానుంది.  

Latest Videos

undefined

అయితే కొత్త నిబంధన ధరఖాస్తు చేసుకొన్న వాళ్లకు ధరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వాళ్లకు వర్తించదని యూఎస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలు వల్ల ఎక్కువగా భారతీయుల మీదే ఎక్కువగా పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

 సుమారు 7లక్షలమంది భారతీయులు హెచ్‌-1బీ వీసాపై అమెరికాకు వెళ్లి పనిచేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు హెచ్‌-1బీ వీసాలు అందుకుంటున్న వారిలో భారతీయ నిపుణులే అధికంగా ఉన్నారు.

click me!