ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో... 8 మంది భారతీయులకు ఐదేళ్ల జైలు.?

By Siva KodatiFirst Published Feb 6, 2019, 8:18 AM IST
Highlights

వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న విద్యార్థులను పట్టుకునేందుకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు నెలకొల్పిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో విచారణ మొదలైంది. 

వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న విద్యార్థులను పట్టుకునేందుకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు నెలకొల్పిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో విచారణ మొదలైంది.

దీనిలో భాగంగా మంగళవారం మిచిగన్ కోర్టులో 8 మంది విద్యార్ధుల్ని అధికారులు హాజరుపరిచారు. రూ.10 వేల డాలర్ల పూచీకత్తుపై ఒకరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే మిగిలిన ఏడుగురికి ఐదేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంది.

పే అండ్ స్టే రాకెట్‌లో మొత్తం 129 మంది భారతీయ విద్యార్థులను హోమ్ ల్యాండ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ విద్యార్థులు ఉద్దేశ్యపూర్వకంగానే నేరానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. 

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే

ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా

click me!