సింగపూర్ లో ఓ వ్యక్తిని ఛాతిమీద చేయివేసి గట్టిగా నెట్టడంతో.. మెట్లమీదినుంచి కిందపడి మృతి చెందాడు. అతడిని భారత సంతతికి చెందిన షణ్ముగంగా గుర్తించారు.
సింగపూర్ : సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందారు. ఓ వ్యక్తి ఛాతీపై నెట్టడంతో షాపింగ్ మాల్ బయట మెట్లపై నుంచి కింద పడి అతను మృతి చెందాడు. 34 ఏళ్ల తేవంద్రన్ షణ్ముగం గత నెలలో ఆర్చర్డ్ రోడ్‌లోని కాంకోర్డ్ షాపింగ్ మాల్ వద్ద మెట్లపై నుంచి వెనుకకు పడిపోయాడు. దీని కారణంగా అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక శుక్రవారం తెలిపింది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది.
శుక్రవారం సాయంత్రం మండై శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.షణ్ముగంను నెట్టివేసింది 27 యేళ్ల ముహమ్మద్ అజ్ఫరీ అబ్దుల్ కహా గా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు అతని మీద పోలీసులు ఉద్దేశపూర్వకంగానే షణ్ముగంను నెట్టి.. మరణానికి కారణమయ్యాడని అభియోగాలు మోపారు. అయితే, ఈ ఘటనకు ముందు ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు తెలుసా అనే విషయం కోర్టు పత్రాల్లో పేర్కొనబడలేదు.
undefined
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు సంచలన నిర్ణయం..
ఆర్చర్డ్ రోడ్‌లోని కాంకోర్డ్ షాపింగ్ మాల్‌లోని ప్రసిద్ధ నైట్‌స్పాట్ బయట ఈ సంఘటన జరిగింది. ఈ షాపింగ్ మాల్ లో అనేక బార్‌లు, నైట్‌క్లబ్ లు ఉన్నాయి. అయితే, షణ్ముగం చనిపోయిన రోజు ఉదయం తమ బార్ కు వచ్చాడని వినిపిస్తున్న వాదనలను నైట్‌క్లబ్ శుక్రవారం తోసిపుచ్చింది. అర్థం లేని ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరింది. అదే సమయంలో అతని మరణానికి తమ క్లబ్ సంతాపం తెలుపుతుందని తెలిపింది. వారి కుటుంబానికి కలిగిన నష్టానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.
నేరం రుజువైతే, అజ్ఫారీకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా విధించబడుతుంది. కోర్టు పత్రాల ప్రకారం, ఇతర నేరాలకు జైలు శిక్ష అనుభవించిన తర్వాత రిమిషన్ ఆర్డర్ కింద అజ్ఫారీ ఈ నేరానికి పాల్పడ్డాడు. నేరం రుజువైతే, అతను 178 రోజుల వరకు అదనపు జైలు శిక్షపడొచ్చు. ఖైదీ తన శిక్షలో కొంత భాగాన్ని జైలు వెలుపల గడపడానికి అనుమతించడానికి రిమిషన్ ఆర్డర్ జారీ చేయబడింది.