టిండర్ పరిచయమైన మహిళపై అత్యాచారం.. భారతీయ సంతతి వైద్యుడికి యూకేలో జైలుశిక్ష..

By SumaBala BukkaFirst Published Jun 16, 2022, 9:00 AM IST
Highlights

భారతీయ సంతతికి చెందిన మనేష్ గిల్ అనే వైద్యుడికి యూకేలో అక్కడి కోర్టు జైలుశిక్ష విధించింది. మూడేళ్ల క్రితం టిండర్ లో పరిచయమైన మహిళ మీద లైంగికవేధింపులకు పాల్పడ్డనేరంలో అతడికి ఈ శిక్ష విధించబడింది. 

లండన్ : మూడేళ్ల క్రితం మహిళపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన వైద్యుడికి స్కాట్లాండ్ కోర్టు బుధవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత నెలలో ఎడిన్‌బర్గ్‌లోని హైకోర్టులో డాక్టర్ ను దోషిగా నిర్ధారించింది. ఇక స్కాటిష్ కోర్టు తీర్పు సమయంలో స్కాటిష్ పోలీసులు అతడిది "భయంకరమైన ప్రవర్తన"గా అభివర్ణించారని ఊటంకిస్తూ అదే కోర్టులో శిక్ష విధించింది. అప్పటికే వివాహం అయిన ఈ జనరల్ ప్రాక్టీషనర్ (GP) ఆన్‌లైన్ డేటింగ్ యాప్ టిండెర్‌లో "మైక్"గా ఎలా పోజులిచ్చారో, డిసెంబర్ 2018లో దాడి జరిగిన స్టిర్లింగ్‌లోని ఒక హోటల్‌లో బాధితురాలిని కలిసేందుకు ఎలా ఏర్పాటు చేశారో కోర్టు సావకాశంగా విన్నది.

"లైంగిక నేరాలకు పాల్పడేవారు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. మీరు ఎప్పటికైనా పట్టుబడతారు. మీరు న్యాయస్థానం ముందు నిలబడతారు. భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. అలాంటి వారికి ఇది ఒక మెసేజ్’ అని స్కాట్లాండ్ పోలీస్ స్కాట్లాండ్  పబ్లిక్ ప్రొటెక్షన్ యూనిట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోర్బ్స్ విల్సన్ అన్నారు.

"గిల్ ఇప్పుడు అతని భయంకరమైన ప్రవర్తనకు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాధితురాలు ముందుకు వచ్చి తన కథను చెప్పడంలో విపరీతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. మా విచారణలో ఆమె చేసిన సహాయానికి మేము ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి ఫలితం ఆమెకు కొంత ఉపశమనం ఇస్తుందని ఆశిస్తున్నాను" అని విల్సన్ అన్నారు.

షార్ణా విమానంలో భారత ప్రవాసి మృతి... కాసేపట్లో స్వదేశానికి, అంతలోనే విషాదం...

"లైంగిక వేధింపుల కేసులను చేధించడానికి మేము కట్టుబడి ఉన్నాము,  ప్రత్యేకంగా శిక్షణ పొందిన అధికారులు మా దగ్గర ఉన్నారు. బాధితులకు మద్దతు అందించడానికి భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. లైంగిక వేధింపులు ఏ రూపంలో ఎదుర్కున్నా మాకు వెంటనే తెలియజేయాలని, వారికి తగిన భద్రత, కేసు పరిశోధన క్షుణ్ణంగా జరుతుందని హామీ ఇస్తున్నామని’ అన్నారాయన.

ఈ సంవత్సరం ప్రారంభంలో విచారణ సందర్భంగా..  సాక్ష్యం చెప్పే సమయంలో నర్సింగ విద్యార్థి అయిన ఆ మహిళ.. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల కారణంగా తన శరీరం ఎలా ముడుచుకుపోయింది వివరించింది. ఎడిన్‌బర్గ్‌లో ఉన్న ముగ్గురు పిల్లల తండ్రి అయిన గిల్, సెక్స్ ఏకాభిప్రాయమని పేర్కొన్నారు. బాధితురాలు దీనికి అంగీకారం తెలపలేదని, దానికి ఆ సమయంలో ఆమె సిద్దంగా లేదని తెలిపింది. అందుకే జ్యూరీ అతన్ని లైంగిక నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. అతని ప్రవర్తనను పర్యవేక్షించడం కోసం అతడిని లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో కూడా చేర్చారు. 

click me!