మూడేళ్ల తరువాత స్వదేశానికి తిరిగివస్తూ.. కాసేపట్లో విమానం దిగుతాననగా ఓ ప్రవాసీయుడు అనుకోకుండా మృతి చెందాడు.
షార్జా : షార్జా నుంచి మూడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్న ఓ indian nri అనారోగ్యం కారణంగా flightలోనే మృతి చెందాడు. keralaకు చెందిన 40 ఏళ్ల మహమ్మద్ ఫైజల్ UAEలో ఓ బేకరీ కంపెనీలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి నుంచి వెళ్లి 3 ఏళ్లు కావడంతో ఒకసారి స్వదేశానికి వెళ్లి రావాలని పైజల్ శనివారం sharjah నుంచి కోజికోడ్ కు విమానం ఎక్కాడు. బోర్డింగ్ సమయంలో బాగానే ఉన్నాడు. కానీ, ఇంకా కొన్ని నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుంది అనగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే విమానంలోనే సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విమానం ఎయిర్ పోర్ట్ ల్యాండ్ కాగానే ఫైజల్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఫైజల్ తో పాటు షార్జాలో ఉండే అతని కజిన్ బ్రదర్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా మెదడు సంబంధిత డిసిజ్ తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇటీవల ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో చికిత్సకోసం స్వదేశానికి వెళ్తున్నట్లు తనతో చెప్పినట్లు తెలిపాడు. మరో సోదరుడు హరీష్ మాట్లాడుతూ పైజలు వస్తున్నాడని తెలియడంతో అతని భార్య, పిల్లల్ని తీసుకుని విమానాశ్రయానికి చేరుకున్నానని.. కానీ, ఇలా విగతజీవిగా కనిపించడంతో షాకయ్యాను అని తెలిపాడు.
మక్కాలో హైదరాబాద్ వాసి మృతి.. భవనంపై నుంచి కిందపడి ప్రమాదం..
కాగా, మే 31న అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. americaలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్ (25) Excursionకు వెళ్ళి సముద్రంలో అలల తాకిడికి మరణించాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్ మిత్రులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు… Vemulawada సుభాష్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎమ్మెస్ చదివేందుకు ఎనిమిది నెలల క్రితం Florida వెళ్ళాడు.
వీకెండ్ కావడంతో ఈ నెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరీలతో కలిసి ఐర్లాండ్లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు బోటు స్టార్ట్ చేయగా.. ఇంజిన్ ఆన్ కాలేదు. అలల తాకిడికి బోటు మూడు మీటర్ల లోతు ప్రాంతం నుంచి... 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది.
ఇది గమనించిన యశ్వంత్ నీటిలోకి దిగాడు. అలలు ఎక్కువగా ఉండడంతో ఎంత ఈతకొట్టినా బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్ ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలోకి దిగి దాదాపు మూడు గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దు:ఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్ మృతితో సుభాష్ నగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.