లండన్‌లో అతిపెద్ద బతుకమ్మ.. 1500 మంది ఆడిపాడి సరికొత్త రికార్డు

By telugu teamFirst Published Oct 11, 2021, 6:53 PM IST
Highlights

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద బతుకమ్మ వేడుకను లండన్‌లో నిర్వహించారు. ఇందులో సుమారు 1500 మంది పాల్గొన్నారు. బతుకమ్మ, కట్టె కోలాటం ఆడారు. ఇందులో లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్, లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
 

ఐరోపా ఖండంలోనే అతిపెద్ద bathukamma వేడుకను లండన్‌లో నిర్వహించారు. సుమారు 1500 మంది ఈ వేడుకలో ఆడిపాడి సరికొత్త record సృష్టించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే europeలోనే అతిపెద్ద బతుకమ్మ వేడుకను నిర్వహించి తెలంగాణ ఎన్నారై ఫోరమ్ రికార్డు తిరగరాసింది. దుర్గా పూజతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి భారత్ నుంచి తెచ్చిన జమ్మి చెట్టును పూజించి బతుకమ్మ ఆట, కట్టె కోలాటం ఇతర సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బతుకమ్మ, కట్టె కోలాటం ఆడి, నిమ్మజ్జనం చేశారు. అనంతరం అందరికీ విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్, లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణులు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత దేశ సంస్కృతిని చాటడం, కళలను ప్రోత్సహించడాన్ని అభినందించారు. ప్రకృతిని పూజించడాన్ని కొనియాడారు. భారత సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఎన్నారైల పై ఉందని లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. వేల మంది ఒకచోట కలిసి పండుగ చేసుకోవడం అరుదు అని, బతుకమ్మ పండుగలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలని మరో ఎంపీ సీమా మల్హోత్రా తెలిపారు.

Also Read: Bathukamma Celebrations : తెలుగు యూనివర్సిటీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి సై..

హిందూ పండుగలు నిర్వహించడం, సంప్రదాయాలను సజీవంగా ఉంచడంపై స్థానిక మేయర్ బిష్ణు సంతోషించారు. సిద్దపేట గొల్లభామ, చేనేత, ఫిలిగ్రీ, పెంబర్తి ఇత్తడి, నిర్మల్ బొమ్మలను వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్నామని అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అన్నారు. ఈ యేడు మళ్లీ అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర తిరగరాసిన ఘనత తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులదేనని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ చెప్పారు.

click me!