విహారయాత్రలో అనుకోని ప్రమాదం .. అమెరికాలో తెలుగు మహిళ మృతి, బాపట్లలో విషాద ఛాయలు

By Siva KodatiFirst Published May 31, 2022, 9:58 PM IST
Highlights

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన ఆలపర్తి సుప్రజ ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్ర సందర్భంగా ప్యారాచూట్‌పై విహరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

అమెరికాలో (america) విషాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ దుర్మరణం పాలయ్యారు. ఆమెను బాపట్ల జిల్లాకు (bapatla district) చెందిన ఆలపర్తి సుప్రజగా (supraja) గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. మార్టురు మండలం చింతపల్లిపాడు గ్రామానికి చెందిన ఆలపర్తి శ్రీనివాసరావు,  సుప్రజ దంపతులు పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. శ్రీనివాసరావు చికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే వీరి కుటుంబం ఫ్లోరిడాకు (florida) మారింది. ఈ దంపతులకు అక్షిత్ చౌదరి, శ్రీ అధిరా సంతానం. 

వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసరావు కుటుంబం స్థానిక తెలుగు కుటుంబాలతో కలిసి విహార యాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో బోటింగ్ చేస్తుండగా బోట్‌కు అనుసంధానించిన ప్యారాచూట్‌పై సుప్రజ , అక్షత్‌లో విహరిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తూ ఈ ప్యారాచూట్ వంతెనకు తగిలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సుప్రజ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా.. అక్షత్, మరో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

Also Read:అమెరికాలో వేములవాడ యువకుడి మృతి.. బోటు కోసం నీటిలోకి దిగి గల్లంతు...

మరో ఘటనలో అదే ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడకు చెందిన కంటె యశ్వంత్‌ (25) సముద్రంలో అలల తాకిడికి మరణించాడు. Vemulawada సుభాష్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎమ్మెస్ చదివేందుకు ఎనిమిది నెలల క్రితం Florida వెళ్ళాడు.

వీకెండ్ కావడంతో ఈ నెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరీలతో కలిసి ఐర్లాండ్లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు  బోటు స్టార్ట్ చేయగా.. ఇంజిన్ ఆన్ కాలేదు. అలల తాకిడికి బోటు మూడు మీటర్ల లోతు ప్రాంతం నుంచి... 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది.

ఇది గమనించిన యశ్వంత్ నీటిలోకి దిగాడు. అలలు ఎక్కువగా ఉండడంతో ఎంత ఈతకొట్టినా బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్ ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలోకి దిగి దాదాపు మూడు గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. అతని మరణవార్తను యశ్వంత్ తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసుల గాలింపు చర్యల్లో సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. యశ్వంత్ మృతితో సుభాష్ నగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

click me!