ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ముగిని ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ముగిని ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాలు.. సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్ ప్రాంతానికి చెందిన రాచకొండ శ్రీనివాస్, అరుణల కుమారుడు రాచకొండ సాయి సూర్య తేజ. సూర్య తేజ హైదరాబాద్ నగరంలోనే బీ.టెక్ పూర్తి చేశాడు. అనంతరం 2019లో ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2020 అక్టోబర్‌లో సాయి సూర్య తేజ బైక్‌పై వెళ్తుండగా కారు ఢీ కొట్టడంతో కాలు పూర్తిగా దెబ్బతింది. దీంతో అతనికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
సాయి సూర్య తేజకు మరో శస్త్రచికిత్స ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేయాలంటే స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని డాక్టర్ల సూచనతో..రోజు స్విమ్మింగ్‌కు వెళ్లేవాడు. ఇక, ఈ నెల 7వ తేదీన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో తాను నివాసం ఉండే గోల్డెన్ కాస్ట్ రిసార్ట్‌లో ఉన్న సిమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తు నీళ్లలో ముగినిపోయి మృతిచెందారు.
సూర్య తేజ మృతిచెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆస్ట్రేలియాలోని సూర్య తేజ స్నేహితులు, తెలుగు సంఘాలు అతడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్య తేజ మృతదేహాం ఈ నెల 14, 15 తేదీల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చేబుతున్నారు. ఇక, రెండు నెలల క్రితమే సూర్య తేజ సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు.
2019లో ఆస్ట్రేలియాకు వెళ్లి సాయి సూర్య తేజ.. కరోనా, ఇతర కారణాల వల్ల మధ్యలో స్వదేశానికి రాలేకపోయాడు. ఏప్రిల్ 14న సాయి సూర్యతేజకు శస్త్ర చికిత్స ఉన్న నేపథ్యంలో.. తల్లిదండ్రులు కొడుకు బాగోగులు చూసుకోవడానికి అక్కడి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇంతలోనే సాయి సూర్యతేజ మృతిచెందాడు. కొడుకు మరణంతో శ్రీనివాస్, అరుణ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.