సింగపూర్ లో భారతీయ విద్యార్థులకు భారీ ఫైన్ వేసిన కోర్టు.. విషయం ఏంటంటే...

By SumaBala Bukka  |  First Published Mar 9, 2022, 2:02 PM IST

సింగపూర్ కోర్టు అక్కడి భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వారికి భారీ మొత్తంలో ఫైన్ విధించింది. దీనికి వారు కరోనా నిబంధనలు బ్రేక్ చేయడమే కారణం. 


సింగపూర్ : భారత విద్యార్థులపై Singapore Court ఆగ్రహం వ్యక్తం చేసింది. Indian Students తప్పు చేసినట్టు రుజువు కావడంతో వారికి భారీ మొత్తంలో ఫైన్ విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గింది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. ఇందులో భాగంగానే సింగపూర్ ప్రభుత్వం కూడా COVID-19 Ruleను అమలు చేసింది. అయితే.. ఈ నిబంధనలను భారత్ కు చెందిన హర్జాజ్ సింగ్, వెర్మా పుల్కిత్ ఉల్లఘించారు.

న్యూ ఇయర్ సందర్భంగా మాస్క్ లేకుండా వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుని అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు.. వారిని దోషులుగా తేల్చింది. పుల్కిత్ కు రూ. 1.68లక్షలు, హర్జాజ్ సింగ్ కు 1.12 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. సింగపూర్ లో అమలవుతున్న ఆదేశాల ప్రకారం కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన వారికి గరిష్టంగా రూ. 5.62 లక్షల వరకు ఫైన్ విధించనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. 

Latest Videos

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన తల్లి కొడుకులు మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాలు 
Australiaలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున Floods సంభవించాయి. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన హేమలతాసోల్హైర్ సత్చితానందం,  ఆమె 34 ఏళ్ల కుమారుడు సోమవారం కారుతో సహా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. dead bodyలను కూపర్స్ క్రీక్ కెనాల్‌లో న్యూసౌత్ వేల్స్‌  పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత  మృతదేహాలను Postmortem నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తల్లి కొడుకుల మృతి పై స్థానిక అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!