దక్షిణాఫ్రికాలో విషాదం: స్విమ్మింగ్‌పూల్‌లో పడి చిన్నారి మృతి.. ఆలస్యంగా గుర్తింపు

By Siva KodatiFirst Published Oct 18, 2019, 1:19 PM IST
Highlights

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన కన్నేటి శంకర్ దక్షిణాఫ్రికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు భార్య మమత, కుమారులు సాయి కుమార్, జువిత్‌తో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో  జువిత్ గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాడు. 

దక్షిణాఫ్రికాలోని తెలుగు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్‌పూల్‌లోపడి మరణించాడు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన కన్నేటి శంకర్ దక్షిణాఫ్రికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు భార్య మమత, కుమారులు సాయి కుమార్, జువిత్‌తో కలిసి అక్కడే ఉంటున్నాడు.

ఈ క్రమంలో  జువిత్ గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని మిత్రులు కానీ కుటుంబసభ్యులు కానీ దీనిని గుర్తించకపోవడంతో చిన్నారి మరణించాడు.

జువిత్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని శనివారం భారతదేశానికి తీసుకురానున్నారు. మరోవైపు జువిత్ తాతయ్య కన్నేటి కోటయ్య ఖమ్మం జిల్లాలో బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారు. 

అమెరికాలో ముగ్గురు తెలుగు విద్యార్ధుల మృతి: ఇద్దరిది నెల్లూరే

గత నెలలో అమెరికాలోని జలపాతం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మరణించారు. నెల్లూరు జిల్లా న్యూమిలటరీ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ రెడ్డి, టెక్కేమిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి తేజా కౌశిక్‌లు మంగళవారం సెలవు కావడంతో మిత్రులతో కలిసి ఓక్లాలో ఉన్న టర్నర్ ఫాల్స్‌కు వెళ్లారు.

అక్కడ 13 అడుగుల లోతున్న జలపాతం వద్ద వీరంతా స్నానాలు చేస్తుండగా కౌశిక్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. అతనిని కాపాడబోయిన రాయచూరుకు చెందిన అజయ్, కేదార్‌నాథ్ రెడ్డి కూడా నీటిలో మునిగి గల్లంతయ్యారు.

దీంతో మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఓక్లా డావిస్ పోలీసులు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. కౌశిక్ స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి కాగా.. ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉంటున్నారు.

అమెరికాలో పడవ ప్రమాదం... మృతుల్లో భారతీయ జంట

కౌశిక్ బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు ఏడాది క్రితం అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో చేరాడు. అటు రాయచూర్‌కు చెందిన మరో విద్యార్ధి అజయ్ కోయిలమూడిది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా. వీరి కుటుంబం 40 ఏళ్ల క్రితమే సింధనూరులో స్థిరపడింది. విద్యార్ధుల మరణవార్తతో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

click me!