అందాల కిరీటాన్ని పక్కనబెట్టి, తిరిగి వైద్య వృత్తిలోకి: సమస్యలపై ప్రభుత్వానికి దరఖాస్తు

By Siva KodatiFirst Published Apr 9, 2020, 4:50 PM IST
Highlights

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు గాను ప్రపంచంలోని వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఇతర యంత్రాంగానికి ఈ విపత్కర సమయంలో పలువురు ప్రముఖులు సైతం తోడుగా నిలుస్తున్నారు

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు గాను ప్రపంచంలోని వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఇతర యంత్రాంగానికి ఈ విపత్కర సమయంలో పలువురు ప్రముఖులు సైతం తోడుగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో మిస్ ఇంగ్లాండ్‌‌గా నిలిచిన భారత సంతతి యువతి సంచలన నిర్ణయం  తీసుకున్నారు. వివరాల్లోకి భారత మూలాలున్న భాషా ముఖర్జీ  2019లో మిస్ ఇంగ్లాండ్‌గా నిలిచారు.

ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో కరోనా అంతకంతకూ పెరుగుతుండటంతో దేశంలో వైద్యులు, మెడికల్ సిబ్బంది కోరత ఏర్పడింది. వీరికి సేవ చేయాలని భావించిన భాషా ముఖర్జీ రోగులకు సేవ చేసేందుకు గాను మళ్లీ వైద్య వృత్తిని చేపట్టారు.

Also Read:సౌదీ రాజకుటుంబంలో 150 మందికి కరోనా,క్వారంటైన్ కు తరలింపు

కోల్‌కతాలో జన్మించిన ముఖర్జీ ఎనిమిదేళ్ల వయసులో కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. అక్కడే విద్యాభ్యాసం చేసిన భాషా ముఖర్జీ డాక్టర్ పట్టా పొందారు. అనంతరం శ్వాసకోశ చికిత్సలో ప్రత్యేకతను సాధించారు.

అయితే ఆసక్తికరంగా బ్యూటీ ప్రపంచంలోకి అడుగుపెట్టి గతేడాది ఆగస్టులో మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు భాషా. అనంతరం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ వృత్తి నుంచి విరామం  తీసుకున్నారు.

ఈ క్రమంలో ఆఫ్రికా, టర్కీ, భారత్‌లలో పర్యటిస్తూ.. మరికొన్ని దేశాలను కూడా సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రపంచంతో పాటు ఇంగ్లాండ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో భాషా తిరిగి స్టెతస్కోపును పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

గత వారం భారత పర్యటన ముగించుకుని ఇంగ్లాండ్‌కు చేరుకున్న భాషా ముఖర్జీ 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ సమయంలో ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది వసతికి సంబంధించి 50 శాతం తగ్గింపు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

Also Read:కరోనా దెబ్బ:ట్రంప్ విమర్శలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌంటర్ ఇదీ....

తాను తన కోసం మాత్రమే కాదని, అందరు వైద్య సిబ్బంది కూడా వారంలో ఏడు రోజుల పాటు రోజుకు 13 గంటల షిఫ్టులో పనిచేస్తున్నట్లు ఆమె గుర్తుచేశారు. లండన్ వంటి నగరాలతో పోలిస్తే లింకన్‌షైర్‌లోని ఓ చిన్న పట్టణం బోస్టన్‌లో అద్దె ధరలు ఎక్కువగా ఉన్నాయని భాషా తెలిపారు.

ఇంగ్లాండ్‌‌లోని ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని డెర్బీ పట్టణానికి చెందిన ముఖర్జీ... వచ్చే వారం తన జూనియర్ డాక్టర్ పదవిని తిరిగి స్వీకరించనున్నారు. ఇంతకుముందు ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు సరసమైన అద్దెతో ఇంట్లో నివసిస్తున్నానని భాషా ముఖర్జీ చెప్పారు.

అందువల్ల తన గ్రేడ్ పే వైద్యులు ఎంచుకునే 605 పౌండ్ల అద్దెతోనే ఆసుపత్రి వసతిని ఎంచుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని ఆమె తెలిపారు. తన లాంటి వారి ఇబ్బందులను పరిష్కరించాలని ఆమె యూకే ప్రభుత్వాన్ని కోరారు.

click me!