ప్రీతిరెడ్డి హత్య కేసులో ట్వీస్ట్: మాజీ లవర్ అబద్ధాలు

By telugu team  |  First Published Mar 7, 2019, 11:11 AM IST

ప్రీతిరెడ్డి మరణించిన మర్నాడే హర్షవర్ధన్ కారు ప్రమాదంలో మరణించాడు. ప్రీతిరెడ్డి అదృశ్యమైన తర్వాత కామన్ ఫ్రెండ్ ఒకరు హర్షవర్ధన్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్, ప్రీతి దంత వైద్య సదస్సుకు హాజరయ్యారు.


హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హత్యకు గురైన తెలంగాణ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రీతిరెడ్డి ఆస్ట్రేలియాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రీతిరెడ్డి గురించి  కామన్ ఫ్రెండ్ అడిగినప్పుడు ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ నర్డే అబద్ధమాడినట్లు తేలింది.

ప్రీతిరెడ్డి మార్చి 3వ తేదీన కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మార్చి 5వ తేదీ రాత్రి 9.30 గంటలకు తన కారులోనే శవమై కనిపించింది. ఆమె శరీరంపై పలు కత్తిగాట్లు ఉన్నాయి. ప్రీతిరెడ్డి చివరిసారి మార్చి 3వ తేదీ ఉదయం 11 గంటలకు తన కుటుంబ సభ్యులతో మాట్లాడింది.

Latest Videos

undefined

ప్రీతిరెడ్డి మరణించిన మర్నాడే హర్షవర్ధన్ కారు ప్రమాదంలో మరణించాడు. ప్రీతిరెడ్డి అదృశ్యమైన తర్వాత కామన్ ఫ్రెండ్ ఒకరు హర్షవర్ధన్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్, ప్రీతి దంత వైద్య సదస్సుకు హాజరయ్యారు. దాంతో ఫ్రెండ్ ప్రీతి గురించి హర్షవర్ధన్ ను అడిగాడు. 

ఫ్రెండ్ పంపిన సందేశానికి హర్షవర్ధన్ తాను శనివారం సాయంత్రం ప్రీతితో మాట్లాడినట్లు హర్షవర్ధన్ చెప్పాడు. ఎక్కడికి వెళ్తుందో ఏమైనా చెప్పిందా అని అడిగితే ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిందని హర్షవర్ధన్ చెప్పాడు. ఎక్కడైనా పడుకుందేమో, చెడు ఏమీ జరగదనే అనుకుంటున్నా, ఆమె ఫోన్ స్విచాఫ్ ఉందని కూడా చెప్పాడు. 

తాను ప్రీతిరెడ్డి సోదరి నిత్యారెడ్డితో మాట్లాడానని, కుటుంబ సభ్యులు ప్రీతిరెడ్డి గురించి ఆందోళన చెందుతున్నారని హర్షవర్ధన్ తో మిత్రుడు అన్నాడు. తాను కూడా ఆందోళన చెందుతున్నానని, గత 30 నిమిషాలు తామిద్దరం ఒకే చోట కూర్చున్నామని మిత్రుడు హర్షవర్ధన్ తో అన్నాడు. 

ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని, నాలుగైదు నెలల తర్వాత ప్రీతీ తానూ మాట్లాడుకున్నామని, లేచి చూసే సరికి ఇలా జరిగిందని హర్షవర్ధన్ అన్నాడు. 

హర్షవర్ధన్ ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు. పరస్పర అంగీకారంతో విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ప్రీతి మరో వ్యక్తి సన్నీ వేములకు దగ్గరైనట్లు తెలుస్తోంది. మార్చి 4వ తేదీన హర్షవర్ధన్ కారు ప్రమాదంలో మరణించాడు. 

హర్షవరద్ధన్ తన బిఎండబ్ల్యూ కారును కావాలని మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు కార్ల్ వుడ్ స్ట్రైక్ ఫోర్స్ డిటెక్టివ్ లు భావిస్తున్నారు. 

సంబంధిత వార్త

సూట్ కేసులో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి శవం: బాయ్ ఫ్రెండ్ పనే..

click me!