ఇప్పటికే తెలంగాణ లో బలోపేతమైన టీఆర్ఎస్ పార్టీని...దేశంతో పాటు విదేశాల్లో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ కవిత వెల్లడించారు. ఆ దిశగా విదేశాల్లోని తెలంగాణ వాసులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ప్లీనరీలోపు దాదాపు 100 దేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలని కవిత టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలకు సూచించారు.

మంగళవారం హైదరాబాద్‌లో ఎంపి కవితతో మహేశ్ బిగాల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎన్నారై శాఖల ఏర్పాటు, శాఖల పని తీరు, కార్యకలాపాలపై వీరిద్దరు చర్చించారు.
undefined
ఇటీవలే ఏర్పడిన కెనడా దేశం టీఆర్ఎస్ శాఖతో కలిపి మొత్తం 40 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు ఏర్పాటయ్యాయని మహేష్ బీగాల ఎంపి కవితకు వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27 న జరిగే ప్లీనరీ నాటికి 100 దేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలని ఎంపి కవిత కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ శాఖలు, గులాబీ జెండాలు రెపరెపలాడాలని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయని, పార్టీని విదేశాల్లోనూ బలపడెలా చూడడం మన బాధ్యత అని ఎంపి కవిత మహేశ్ బిగాలా తో అన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని... పరిపాలన, అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నారై బాధ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా టిఆర్ఎస్ మిషన్ లో భాగస్వాముల అయి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసువచ్చెందుకు కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎన్నారై బాధ్యులను ప్రశంసిస్తూ, వారికి అభినందనలు తెలిపారు.
కెనడా దేశంలో టిఆర్ఎస్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అడ్ హక్ కమిటీ ఏర్పాటుకు కవిత ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో కృష్ణ కోమండ్ల, ప్రభాకర్ తూము, సంపత్ బాలమొని, సాయి రామకృష్ణ కంటే, సతీష్ వీరవెల్లి, చేతన్ కొరబోయిన, శ్రీనాథ్ కుందూరు, కరుణాకర్ పీచర, మహ్మద్ యార్ఖాన్ లు వున్నారు.