సింగపూర్ క్రూయిజ్ నుండి దూకి 64 ఏళ్ల భారతీయ మహిళ మృతి

By SumaBala BukkaFirst Published Aug 2, 2023, 11:41 AM IST
Highlights

సింగపూర్ క్రూయిజ్ నుండి దూకి 64 ఏళ్ల భారతీయ మహిళ మృతి చెందింది.  నిన్న జరిగిన ఈ ఘటనపై పీఎంవో, విదేశాంగ మంత్రి, సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయాలు ఇంకా స్పందించలేదు.

సింగపూర్ : సింగపూర్ జలసంధి గుండా వెళుతున్న రాయల్ కరేబియన్ క్రూయిజ్ నుంచి దూకి  ఓ భారతీయ మహిళ మృతి చెందినట్లు సమాచారం.  64 ఏళ్ల తప్పిపోయిన ఆ మహిళ కుమారుడు తన తల్లిని కనిపెట్టడంలో సహాయపడాలని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సహాయం కోరాడు. క్రూయిజ్ కంపెనీ ఆ మహిళ కనిపించడంలేదని సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపాడు. 

తన నిరంతర ప్రయత్నాలతో తన తల్లి చనిపోయిందని తెలిసిందని అపూర్వ్ సహాని ఆ తరువాతి ఒక ట్వీట్ లో పేర్కొన్నాడు. క్రూయిజ్ లైనర్ నిఘా ఫుటేజీలో అది తేలిందన్నారు. తల్లి మృతదేహం కోసం అన్వేషణ జరుగుతోందని తెలిపారు. తనకు సహాయం చేసినందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పిఎంఓ, సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ లో ఉన్న బావతో హిందీలో ఫోన్ మాట్లాడాడని.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికా కంపెనీ..

భారతీయ హైకమిషన్ కుటుంబంతో టచ్ లో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సింగపూర్ అధికారులతో కాంటాక్ట్ లో ఉంది. చట్టపరమైన ప్రక్రియలను సులభతరం చేస్తోంది. అపూర్వ్ సహానికి అన్ని రకాల సహకారాన్ని అందించడానికి రాయల్ కరేబియన్ క్రూజ్ ఇండియన్ హెడ్ ని కూడా సంప్రదించారు.

అయితే, అంతకు ముందు సహానీ ఈ ఘటన గురించి చెబుతూ.. తన తల్లి ఓడ నుండి దూకిందని సిబ్బంది తనకు సమాచారం ఇచ్చారని అన్నారు.  అయితే సిబ్బంది ఎలాంటి నిఘా ఫుటేజీని చూపించలేదని, తన తల్లిని గుర్తించడానికి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ కూడా చేయలేదని.. ఆమెతో పాటు వచ్చే తండ్రిని కూడా దించేశారని అతను ముందుగా చెప్పాడు.

అపూర్వ్ సహాని అయిన రీతా సహానీ, తన భర్త జాకేశ్ సహానీతో కలిసి 'స్పెక్ట్రమ్ ఆఫ్ ది సీస్' క్రూయిజ్ షిప్‌లో ఎక్కింది. ఈ షిప్ సింగపూర్‌కు వెళుతున్నప్పుడు ఓడ నుండి దూకినట్లు స్ట్రెయిట్ టైమ్స్‌ పత్రికా కథనాలు చెబుతున్నాయి. 

అంతకు ముందు స్ట్రెయిట్ టైమ్స్‌తో సహాని మాట్లాడుతూ, "మా అమ్మ మిస్సింగ్ అని తెలియడంతో సీసీ టీవీ ఫుటేజీని చూడమని అడిగాం. కానీ, ఇప్పటివరకు వారేమీ ఇవ్వలేద’ని అన్నారు. ఆమె దూకిందని ఓడ సిబ్బంది అనుకుంటున్నారు..అన్నారు.

"చివరికి, నా తండ్రిని కూడా ఓడ నుండి దించారు. ఎందుకంటే మరొక క్రూయిజ్ కూడా వస్తోంది. అందులో ఉండొచ్చని అనుకున్నారని తెలిపారు.  తన తల్లికి ఈత రాదని, అతని తండ్రిని పోలీసులు గంటల తరబడి ఇంటర్వ్యూ చేశారని సహానీ చెప్పారు.

click me!