అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలుగు ఎన్ఆర్ఐలు దుర్మరణం

Siva Kodati |  
Published : Feb 25, 2020, 06:41 PM IST
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలుగు ఎన్ఆర్ఐలు దుర్మరణం

సారాంశం

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు ఎన్ఆర్ఐలు మరణించారు. 

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు ఎన్ఆర్ఐలు మరణించారు. మృతులను హైదరాబాద్ ముషీరాబాద్‌ సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన రాజా గవిని (41), దివ్య ఆవుల (34), విజయవాడకు చెందిన ప్రేమ్ నాథ్ రామనాథం (42)గా గుర్తించారు.

Also Read:గ్రాసరీ స్టోర్ లో కాల్పులు.. ఎన్ఆర్ఐ మృతి

రాజా, దివ్యలు ఫ్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచిపెట్టి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు.

Also Read:68 వేల మంది భారతీయులకు హెచ్1బీ గండం : దొరికితే అమెరికాలోనే.. లేదంటే ఇంటికే

అదే సమయంలో అక్కడికి దగ్గరలో నిర్మిస్తున్న తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు ప్రేమ్‌నాథ్‌ను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎం 423 ఇంటర్ ‌సెక్షన్ వద్దకు రాగానే వీరు ముగ్గురు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..