విపణిలోకి వోక్స్ వ్యాగన్ సరికొత్త వెంటో, పొలో

By narsimha lodeFirst Published Sep 5, 2019, 10:28 AM IST
Highlights

వోక్స్ వ్యాగన్ విపణిలోకి రెండు సరికొత్త మోడల్ కార్లను విడుదల చేసింది. 

ముంబై: జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ విపణిలోకి రెండు సరికొత్త మోడల్ కార్లను విడుదల చేసింది. పోలో, వెంటో 2019 ఎడిషన్లను ఆవిష్కరించింది. పోలో ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ధర రూ.5.82 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వెంటో మోడల్ కారు ధర రూ.8.76 లక్షల నుంచి మొదలవుతుంది. 

ఈ రెండు కార్లలోనూ వోక్స్ వ్యాగన్ సరికొత్త ఫీచర్లను జత చేసింది. సన్‌సెట్ రెడ్ రంగునూ అందుబాటులోకి తెచ్చింది. పోలో కారు గ్రిల్స్‌లో స్వల్ప మార్పులు చేసింది. కొత్త మోడల్ కార్లో 10 మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్ కూడా ఇచ్చిన వోక్స్ వ్యాగన్ పోలో మోడల్ సరికొత్త స్పాయిలర్ ఫీచర్ అమర్చారు.

ఇక వెంటో కారులో పూర్తి ఎల్ఈడీ లైట్లు అందుబాటులోకి వచ్చాయి. బంపర్ డిజైన్లలో మార్పులు జరిగాయి. పోలోలో మాదిరిగానే వెంటో కారులోనూ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.

రెండు కార్లలోనే లభించే డీజిల్ వేరియంట్లకు ఐదేళ్లు, పెట్రోల్ వేరియంట్లకు నాలుగేళ్ల వారంటీ ఇచ్చింది వోక్స్ వ్యాగన్, దీన్ని అవసరాన్ని బట్టి ఏడేళ్ల వరకు పెంచుకోవచ్చునని తెలిపింది. పోలో, వెంటో మోడల్ కార్లు తమ బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ అని వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్ల విభాగం భారత్ డైరెక్టర్ స్టీఫెన్ క్నాప్ తెలిపారు. 

ఈ రెండు కార్లకు సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ తదితర వ్యవస్థలు ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ పోలో ఫేస్ లిఫ్ట్ కారు.. ప్రత్యర్థి సంస్థలు మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఫోర్డ్ ఫిగో మోడల్ కార్లతో.. వెంటో ఫేస్ లిఫ్ట్.. మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా మోడల్ కార్లతో పోటీ పడనున్నది.  

click me!