దగ్గరవుతున్న సుజుకి-టయోటా... సుజుకి మోడల్ తయారీ టయోటా ప్లాంట్‌లో

By Arun Kumar PFirst Published Mar 21, 2019, 3:18 PM IST
Highlights

 జపాన్ ఆటోమొబైల్ మేజర్లు టయోటా, సుజుకి ప్రపంచ వ్యాప్తంగా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. సుజుకి అనుబంధంగా ఉన్న మారుతి సుజుకి తయారు చేసిన కంపాక్ట్ మోడల్ కార్లు బాలెనో, విటారా బ్రెజ్జా తదితర మోడళ్ల టెక్నాలజీని టయోటాకు అందజేస్తుంది. టయోటా తాను అభివ్రుద్ధి చేసిన విద్యుత్ హైబ్రీడ్ టెక్నాలజీని సుజుకికి అందజేస్తుంది. 

న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ సంస్థలు టయోటా మోటార్స్ కార్పొరేషన్, సుజుకి మోటార్ కార్పొరేషన్ మధ్య కొలబారేషన్ కుదిరింది. తమ మద్య సహకార ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవాలని టయోటా, సుజుకి నిర్ణయించుకున్నాయి. సుజుకి డెవలప్ చేసిన విటారా బ్రెజా మోడల్ కారును 2022 నుంచి భారతదేశంలోని టయోటా ప్లాంట్‌లో తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

టయోటా, సుజుకి సంస్థలు తమ సహకారాన్ని యూరప్, ఆఫ్రికా ఖండ దేశాలకు విస్తరించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా టయోటా సంస్థ మారుతి తయారుచేస్తున్న సియాజ్, ఎర్టిగా మోడల్ కార్లను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు టయోటా తెలిపింది. 

ఇప్పటికే మారుతి సుజుకి కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కార్లు బాలెనో, విటారా బ్రెజా, సియాజ్, ఎర్టిగా మోడల్ కార్లను టయోటా ద్వారా ఆఫ్రికా మార్కెట్లలో సరఫరా చేయడానికి అంగీకారం కుదిరినట్లు రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 

దీనికి ప్రతిగా టయోటా కిర్లోస్కర్ సంస్థ మారుతి సుజుకి సంస్థకు తాను తయారు చేసిన హైబ్రీడ్ విద్యుత్ వాహన (హెచ్ఈవీ) టెక్నాలజీని అందజేస్తుంది. భారతదేశంలో తయారుచేసిన హెచ్ఈవీ సిస్టమ్స్, ఇంజిన్లు, బ్యాటరీలతోపాటు టయోటా హైబ్రీడ్ సిస్టమ్ (టీహెచ్ఎస్) సరఫరా చేస్తుంది. తద్వారా విద్యుత్ వాహనాల రంగంలో గ్లోబల్ మార్కెట్‌లోకి సుజుకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. 

టయోటా ప్రెసిడెంట్ అకియో టయోడా స్పందిస్తూ నూతన అగ్రిమెంట్ ప్రకారం హైబ్రీడ్ టెక్నాలజీని వాహనాల ఉత్పత్తి కోసం విస్త్రుతంగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సహకార ఒప్పందం ఆఫ్రికా, యూరప్, భారతదేశాలకు మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. 

సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకి మాట్లాడుతూ గతేడాది మే నెలలో ప్రకటించిన నిర్ణయం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తమ మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు క్రుషి చేయాలన్నారు. టయోటా ఆఫర్‌ను  అభినందిస్తున్నామని చెప్పారు. 

తాజా ఒప్పందం ప్రకారం సుజుకి అభివ్రుద్ధి చేసిన కంపాక్ట్ వెహికల్స్ ఇంజిన్లను టయోటా అందుకుంటుంది. డెన్సో, టయోటా మోటార్స్  కార్లలో వాడతారు. దానికి ప్రతిగా టయోటా అభివ్రుద్ది చేసిన రావ్4, కొరొల్లా వాగన్ మోడల్ విద్యుత్ వెహికల్స్‌ టెక్నాలజీని మారుతి యూరప్ దేశాల్లో వాడుకునేందుకు అందజేస్తుంది. 

click me!