సేఫ్టీ పీచర్లతో మారుతి ‘ఈకో’: ఓలాతో కియా బంధం

By Arun Kumar PFirst Published Mar 20, 2019, 1:44 PM IST
Highlights

దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి’ తన ‘ఈకో’ మోడల్ కారును అదనపు సేఫ్టీ ఫీచర్లతో అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఈ కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షలకు లభిస్తుంది. మరోవైపు హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా, క్యాబ్ సర్వీసెస్ సంస్థ ‘ఓలా’తో ఒప్పందం కుదుర్చుకున్నది. 

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ‘ఈకో’మోడల్  అప్‌డేటెడ్‌ వెర్షన్‌ కారును ఆవిష్కరించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనల అమలు కోసం అదనపు విడి భాగాలు జత చేసింది. అందులో భాగంగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, స్టాండర్డ్‌ ఫిట్‌మెంట్‌గా కో-డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌తోపాటు అదనంగా పలు భద్రత ఫీచర్లను జోడించినట్లు కంపెనీ తెలిపింది. 

ఇంకా డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ లండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా కొత్తగా యాడ్ చేసింది. కొన్ని వేరియంట్లలో స్పీడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌, ఏబీఎస్‌, ఎయిర్‌ బ్యాగ్‌ ఫీచర్లను సైతం అందిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. కొత్త ఈకో మోడల్ కారు ధర వేరియంట్‌ను బట్టి రూ.400- 23,000 పెరగనుంది. ప్రస్తుతం ఈకో ధర రూ.3.37-6.33 లక్షల మధ్యలో ఉంది. ఇక కారు 80 కి.మీ. వేగంతో వెళుతున్నప్పుడు డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్‌ను సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రిమైండర్ అలర్ట్ జారీ చేస్తుంది. బీప్ సౌండ్‌తో డ్రైవర్ ను హెచ్చరిస్తూ ఉంటుంది. 

మారుతి ఈకో మోడల్ కారు ఐదు సీట్లు, ఏడు సీట్ల ఫార్మాట్‌లో లభ్యం కానున్నది. లాంగ్ స్టాండింగ్ జీ12బీ, 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. సీఎన్జీ కిట్ వాడకానికి వీలుగానూ ఉంటుంది. టూర్ వీ మాదిరిగా స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ ఏర్పాటైన మోడల్ ఈకో. ఇక  ప్లీట్, క్యాబ్ ఆపరేటర్ల నిర్వహణకు వీలుగా రూపుదిద్దుకున్నదీ మారుతి ఈకో అప్ డేటెడ్ వర్షన్ కారు. 


ఓలాతో హ్యుండయ్‌, కియా జట్టు 
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్.. భారతదేశంలో సమగ్ర రవాణా రంగ కంపెనీగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తన గ్రూప్‌ అనుబంధ కియా మోటార్స్‌తో కలిసి యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలు అందించే భారత ఓలా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మూడు కంపెనీలు విద్యుత్‌ వాహనాల అభివృద్ధి, వాటికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, క్యాబ్‌ సేవలకు అవసరమైన వాహనాల అభివృద్ధి చేస్తాయి. ఇందుకోసం హ్యుండాయ్‌, కియా మోటార్‌, ఓలా కంపెనీకి రూ.2,070 కోట్ల నిధులు సమకూరుస్తాయి. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం ప్రయాణికుల వాహనాల అభివృద్ధి, ఉత్పత్తి, అమ్మకాలకు మాత్రమే పరిమితమయ్యాయి.  

click me!