జియో సంచలనం: ఫ్రెష్ న్యూస్ కోసం యాప్ కమ్ వెబ్

By rajesh y  |  First Published Apr 12, 2019, 11:00 AM IST

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నూతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో న్యూస్’ పేరిట తాజా వార్తలను అందుబాటులోకి తెస్తూ ఒక యాప్ ప్రారంభించింది. ఇందుకు వెబ్ పేజీ కూడా క్రియేట్ చేసింది.


ముంబై: ఎప్పటికప్పుడు దేశ, విదేశీ తాజా వార్తలు అందించేలా ‘జియో న్యూస్‌’ అప్లికేషన్‌తో పాటు వెబ్‌ కోసం (www.jionews.com)ను ప్రారంభించామని రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి మొబైల్స్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎన్నికల ఫలితాలు, ఐపీఎల్ ప్లస్ వరల్డ్ కప్ ఫలితాల కోసం
లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు జరగటానికి తోడు ప్రపంచకప్‌ పోటీలు కూడా ప్రారంభం కానున్న తరుణంలో ఈ యాప్‌ కస్టమర్లకు చేరువవుతుందని సంస్థ ఆశిస్తోంది. బ్రేకింగ్‌న్యూస్‌, 150కి పైగా చానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు, వీడియోలు, 800కు పైగా మ్యాగజైన్లు, 250కి పైగా వార్తా పత్రికలు వంటివన్నీ ఇందులో లభిస్తాయని తెలిపింది. 

Latest Videos

undefined

నచ్చిన భాషలో జియో న్యూస్ చూసుకోవచ్చు
జియో న్యూస్‌లో 12కు పైగా భారతీయ భాషల నుంచి నచ్చినవి ఎంచుకోవచ్చు. నచ్చిన రంగాల వార్తలను హోమ్‌పేజీగా ఏర్పాటు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. జియో ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌, జియోమ్యాగ్స్‌, జియో న్యూస్‌పేపర్‌ యాప్‌లకు తోడు లైవ్‌టీవీ, వీడియోలు కలిపి జియో న్యూస్‌  యాప్‌గా ‘మీ వార్తలు, మీ భాషలోనే’ భావనతో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది.

భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ విలీనానికి ఓకే
భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్‌ (టీటీఎస్‌ఎల్‌) విలీనానికి టెలికం శాఖ (డాట్‌) ఆమోదం తెలిపింది. రూ. 7,200 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఎయిర్‌టెల్‌ ఇవ్వాలన్న షరతు విధించినట్టు ప్రభుత్వ అధికార వర్గాల కథనం. ఈ విలీనానికి ఏప్రిల్‌ 9న టెలికాం శాఖ మంత్రి మనోజ్‌ శర్మ షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

రూ.1200 కోట్ల చెల్లించాక విలీనం ప్రక్రియ ముందుకు..
వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీలకు సంబంధించి రూ.6,000 కోట్ల బ్యాంకు గ్యారెంటీతో పాటు టీటీఎస్‌ఎల్‌ నుంచి పొందుతున్న స్పెక్ట్రమ్‌ కోసం రూ.1,200 కోట్లు ఇచ్చిన తర్వాత విలీనం ప్రక్రియ మరింత ముందుకు సాగుతుందని చెబుతున్నారు. విలీన ప్రతిపాదన ప్రకారం.. దేశంలోని 19 టెలికం సర్కిళ్లలో టాటా కన్స్యూమర్‌ మొబైల్‌ బిజినెస్‌ కార్యకలాపాలను ఎయిర్‌టెల్‌ సొంతం చేసుకుంటుంది. స్పెక్ట్రమ్‌ కోసం టాటా బకాయి పడి ఉన్న మొత్తాన్ని చెల్లించేందుకు కూడా ఎయిర్‌టెల్‌ సుముఖత వ్యక్తం చేసింది.
 

click me!