మనదేశంలో అనేక టీవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా తక్కువ టీవీల్లో మాత్రమే ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. తాజాగా జపాన్ బ్రాండ్ జేవీసీ.. స్థానిక ఓఈఎం వైరా గ్రూప్ ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టిన తన కొత్త తరం టీవీలు ఈ కోవకే చెందుతాయి.
మనదేశంలో అనేక టీవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా తక్కువ టీవీల్లో మాత్రమే ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. తాజాగా జపాన్ బ్రాండ్ జేవీసీ.. స్థానిక ఓఈఎం వైరా గ్రూప్ ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టిన తన కొత్త తరం టీవీలు ఈ కోవకే చెందుతాయి.
జేవీసీ 55ఎన్7105సీ(55N7105C) టీవీ అనేది 4కే స్మార్ట్ ఎల్ఈడీ టీవీ. దీని ధర రూ. 38,999. ప్రస్తుతం ఈ టీవీలు ఈ కామర్స్ పోర్టల్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో 39,999కి అందుబాటులో ఉంది.
undefined
ఇది 105సీ క్వాంటమ్-బ్యాక్‌లిట్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. స్క్రీన్ రెజల్యూషన్ 3840x2160 పిక్సెల్స్, ఫ్రెష్ రేట్ 60హెచ్‌జడ్. 50w సౌండ్ టీవీ ముందు కింది భాగం ద్వారా వస్తుంది. 2GB ర్యామ్, 16GB స్టోరేజి, క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగివుంది.
స్మార్ట్ కనెక్టివిటీ కోసం ఈ టీవీకి రెండు ఇంటర్ఫెసెస్ ఉన్నాయి. సీయూఐ, సెన్సీవాల్ తోపాటు.. హాట్‌స్టార్, యూట్యూబ్, నెట్‌ఫ్లెక్స్ లాంటి యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ చేసి వున్నాయి. ఇక హార్డ్‌వేర్ కనెక్టివిటీ కోసం JVC 55N7105C మూడు HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ కలిగివున్నాయి. HDR సపోర్ట్ కూడా ఇందులో జతచేయడం జరిగింది.
వైర్ తోపాటు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకునే వీలుంది. ఇక యాప్ స్టోర్‌లో ఉన్న 500 వరకు యాప్స్‌లో వినియోగదారుడు నచ్చినవి ఎంచుకోవచ్చు. అంతేగాకుండా ఈ టీవీకి రెండు రిమోట్లు వస్తున్నాయి. ఒకటి స్టాండర్డ్‌ది కాగా, మరోటి క్వార్టీ కీబోర్డ్ కలిగి ఉన్నది.
జేవీసీ.. భారతదేశంలో ఇటీవల కాలంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే టీవీలను అందిస్తోంది. వీటి ప్రారంభ ధర రూ.16,999. ఇక కొత్తగా వచ్చిన 55N7105C టీవీ ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ రేంజీలోనే ఫీచర్లను కలిగి ఉంది.